Type 2 Diabetes Causes: సిగరెట్లు మానేస్తే మధుమేహంతోపాటు 5 రకాల వ్యాధులకు చెక్‌ పెట్టినట్లే.. WHO ప్రకటన

|

Feb 07, 2024 | 8:30 PM

ప్రపంచవ్యాప్తంగా సైలెంట్ కిల్లర్‌లా డయాబెటిస్ ముప్పు నానాటికీ పెరుగుతోంది. ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటున్నారు. ప్రస్తుతం 8 నుంచి 80 యేళ్ల వయసు వారంతా ఈ మధుమేహంతో బాధపడుతున్నారు. మన దైనందిన జీవితమే దీనికి కారణం. నేటి కాలంలో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. శారీరక వ్యాయామ అవకాశాలు చాలా తక్కువ. అంతే కాకుండా క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా ఉన్నాయి. మధుమేహం మాత్రమే కాదు..

Type 2 Diabetes Causes: సిగరెట్లు మానేస్తే మధుమేహంతోపాటు 5 రకాల వ్యాధులకు చెక్‌ పెట్టినట్లే.. WHO ప్రకటన
Type 2 Diabetes Causes
Follow us on

ప్రపంచవ్యాప్తంగా సైలెంట్ కిల్లర్‌లా డయాబెటిస్ ముప్పు నానాటికీ పెరుగుతోంది. ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటున్నారు. ప్రస్తుతం 8 నుంచి 80 యేళ్ల వయసు వారంతా ఈ మధుమేహంతో బాధపడుతున్నారు. మన దైనందిన జీవితమే దీనికి కారణం. నేటి కాలంలో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. శారీరక వ్యాయామ అవకాశాలు చాలా తక్కువ. అంతే కాకుండా క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా ఉన్నాయి. మధుమేహం మాత్రమే కాదు, మరికొన్ని వ్యాధులు కూడా క్యాలరీలు అధికంగా ఉండే ఆహారంతో ముంచుకొస్తున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధూమపానం మానేయడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని 40-40% తగ్గించవచ్చని ఈ అధ్యయనాల్లో తేలింది.

టైప్ 2 మధుమేహం అత్యంత దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధికి మందు లేదు. పూర్తి నివారణ కూడా లేదు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం, 95 శాతం దీర్ఘకాలిక వ్యాధులకు మధుమేహం కారణం. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. అదే సమయంలో COPD, డిమెన్షియా వంటి వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ధూమపానం మానేయగలిగితే ఈ వ్యాధుల నుంచి బయటపడినట్లే. ఊపిరితిత్తుల క్యాన్సర్- ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో ధూమపానం ఒకటి. నేటి కాలంలో చాలా మంది ప్రజలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. 90 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు ధూమపానం కారణం. COPD- ఈ వ్యాధి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాదాపు 85-90 శాతం COPD కేసులకు ధూమపానం ప్రధాన కారణం. అలాగే ఈ కింది సమస్యలు కూడా ధూమపానంతో ముడిపడి ఉన్నాయి.

బ్రెయిన్ స్ట్రోక్ – రోజులో 20 సిగరెట్లు తాగడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకు కనీసం రెండు సిగరెట్లు కంటే తక్కువ తాగే వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

చిత్తవైకల్యం – ధూమపానం చిత్తవైకల్యంతో పాటు జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదాన్ని పెంచుతుంది.

దంత సమస్యలు – అధిక సిగరెట్లు దంతాలను కూడా దెబ్బతీస్తాయి. దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. క్యావిటీస్ సమస్య కూడా వస్తుంది. అందుకే ఈరోజు నుండి స్మోకింగ్ మానేయడానికి ప్రయత్నించండి అంటూ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.