ములుగు జిల్లాలో ఘోర రోడు ప్రమాదం..బైక్‌ను ఢీ కొట్టిన కారు.. పరారీలో కారు డ్రైవర్..

|

Dec 22, 2020 | 10:40 PM

ములుగు జిల్లాలో ఘోర రోడు ప్రమాదం చోటు చేసుకుంది. వాజేడు మండలం మండపాక గ్రామ సమీపంలో 163 జాతీయరహదారిపై మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు

ములుగు జిల్లాలో ఘోర రోడు ప్రమాదం..బైక్‌ను ఢీ కొట్టిన కారు.. పరారీలో కారు డ్రైవర్..
Follow us on

ములుగు జిల్లాలో ఘోర రోడు ప్రమాదం చోటు చేసుకుంది. వాజేడు మండలం మండపాక గ్రామ సమీపంలో 163 జాతీయరహదారిపై మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటనాస్థలంలోనే మృతి చెందారు.

ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ ఘటనాస్థలంలోనే వాహనాన్ని వదిలి పరిపోయినట్లుగా తెలుస్తోంది. ఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కారులో లభించిన గుర్తింపుకార్డు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల ఏ ప్రాంతానికి చెందిన వారన్నది ఇంకా వివరాలు తెలియరాలేదు. వివరాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయతిస్తున్నారు.