వీఆర్ఓపై పెట్రోల్ తో దాడి.. అప్రమత్తంతో తప్పినముప్పు

|

Sep 05, 2020 | 1:21 PM

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. గ్రామ రెవెన్యూ అధికారిపై పెట్రోల్ పోసిన సంఘటన అచ్చంపేట మండలం గంధశిరి గ్రామంలో చోటుచేసుకుంది. విఆర్ఒ కోటా మోహన్ రావు పంచాయతీలో ఆఫీసులో కూర్చుని రికార్డులు రాస్తుండగా రావేళ్ల లవణ్ కుమార్, పరుచూరి రామకృష్ణ పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసే ప్రయత్నం.

వీఆర్ఓపై పెట్రోల్ తో దాడి.. అప్రమత్తంతో తప్పినముప్పు
Follow us on

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. గ్రామ రెవెన్యూ అధికారిపై పెట్రోల్ పోసిన సంఘటన అచ్చంపేట మండలం గంధశిరి గ్రామంలో చోటుచేసుకుంది. విఆర్ఒ కోటా మోహన్ రావు పంచాయతీలో ఆఫీసులో కూర్చుని రికార్డులు రాస్తుండగా రావేళ్ల లవణ్ కుమార్, పరుచూరి రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు ఆర్జీలు ఇవ్వమని వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అంతలోనే లవణ్ కుమార్, రామకృష్ణ దాడికి తెగబడ్డారు. తనపై పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసే ప్రయత్నం చేశాడని. ఇంతలో తన తోటి ఉద్యోగి నాగేశ్వర్ రావు అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పిందని మోహన్ రావు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

కాగా, తమ భూమిని ఆన్ లైన్ లో ఎక్కించడానికి తమ దగ్గర విఆర్ఒ లంచం తీసుకొని పనులు చేయడం లేదని తాము పెట్రోల్ పోసుకొని నిరసన తెలుపుతుండగా వాళ్లు అడ్డుకోబోతుండగా వారిపై పెట్రోల్ పడిందని రామకృష్ణ, లవణ్ కుమార్ అచ్చంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఆనంద్ తెలిపారు.