విశాఖ : నేవీ సెయిలర్లను వెంటాడిన మృత్యువు

|

Nov 08, 2020 | 8:11 PM

ఆదివారం రోజు సరదాగా ఆట విడుపు కోసం బీకు వెళ్లిన నేవీ సెయిలర్లను మృత్యువు వెంటాడింది. సరదాగా ఈతకు దిగిన ఇద్దరు సెయిలర్లు గల్లంతవడం..మిగతావారిని షాక్‌కు గురిచేసింది.

విశాఖ :  నేవీ సెయిలర్లను వెంటాడిన మృత్యువు
Follow us on

ఆదివారం రోజు సరదాగా ఆట విడుపు కోసం బీకు వెళ్లిన నేవీ సెయిలర్లను మృత్యువు వెంటాడింది. సరదాగా ఈతకు దిగిన ఇద్దరు సెయిలర్లు గల్లంతవడం..మిగతావారిని షాక్‌కు గురిచేసింది.  విశాఖ నగర పరిధిలోని యారాడ తీరంలో ఈ  విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ఆదివారం హాలిడే కావడంతో మొత్తం 54 మంది నేవీ స్టాఫ్ సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లారు. వీరిలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శుభమ్‌ సింగ్‌(23), మణిపూర్‌కు చెందిన జగత్‌సింగ్‌(28)తో పాటు సునీల్‌, వినీత్‌కుమార్‌ సముద్రం ఒడ్డున కాసేపు వాలీబాల్‌ ఆడి ఆపై ఈతకు దిగారు. కెరటాల ఉద్ధృతి అధికంగా ఉండటంతో జగత్‌సింగ్‌, శుభమ్‌ కొట్టుకుపోయారు. దీంతో వెంటనే అలెర్టయిన మిగతా ఇద్దరు ప్రాణభయంతో ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా సిబ్బంది దీన్ని గమనించి జగత్‌సింగ్‌, శుభమ్‌ను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో జగత్‌సింగ్‌ను అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. కొన ఊపిరితో ఉన్న అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గల్లంతైన శుభమ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విశాఖ న్యూ పోర్టు పోలీసులకు నేవీ కమాండెంట్ విజయ్‌ కృష్ణన్‌ కంప్లైంట్ చేశారు.

Also Read :

రెండోసారి కరోనా సోకి కడప డాక్టర్ మృతి

టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు