కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి

|

Oct 23, 2020 | 3:33 PM

కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఘంటసాల మండల శ్రీకాకుళంలో శుక్రవారం ఉదయం కరెంట్ షాక్‌తో  ఇద్దరు కూలీలు ప్రాణాలు విడిచారు.

కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి
Follow us on

కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఘంటసాల మండల శ్రీకాకుళంలో శుక్రవారం ఉదయం కరెంట్ షాక్‌తో  ఇద్దరు కూలీలు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం చల్లపల్లి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. మృతులు పమిడముక్కల మండలంలోనిఎట్టవానిగూడెంకు చెందిన చిన్నం అనిల్ కుమార్ (30), గొరికపూడి సీతారామాంజనేయులు (30)గా గుర్తించారు. పొలంలో పని చేస్తోన్న సమయంలో విద్యుత్ తీగలు తెగిపడటంతో ప్రమాదం సంభవించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో వరి పంట నీట మునగడంతో… తెగుళ్లు రాకుండా ఎరువులు, క్రిమి సంహారకాలు పిచికారి  చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైతు కూలీలను తీసుకొచ్చి పురుగు మందు పిచికారీ చేయిస్తున్నాడు. ఈ క్రమంలో పొలంలో వేలాడుతున్న విద్యుత్ తీగలు వారికి తగలడంతో కూలీలు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చనిపోగా.. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం అందుతోంది.  దీంతో మెరుగైన వైద్యం కోసం వారిని విజయవాడ లేదా గుంటూరుకు తరలించనున్నారు.

Also Read : యాంక‌ర్ ర‌ష్మీకి క‌రోనా పాజిటివ్ ‌!