శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు

|

Dec 26, 2020 | 10:31 PM

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ మహిళ వద్ద రెండు కేజీల బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Follow us on

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ మహిళ వద్ద రెండు కేజీల బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. మహిళను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దుబాయ్ నుండి హైదరాబాద్‌ వచ్చిన AI 952 విమానంలో మహిళా ప్రయాణికురాలుపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.. తనిఖీల సమయంలో మహిళ బ్యాగులో ఉన్న బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆమె దగ్గర ఐదు బంగారు బిస్కెట్లతో పాటు 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు లభించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 2.021 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీని విలువ రూ.96 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహిళలను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.