కరోనా కల్లోలం.. ఇద్దరు వైద్యులతో సహా 19 మంది సిబ్బందికి..

| Edited By:

Jun 10, 2020 | 7:15 PM

కొవిడ్‌-19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం వ్యాక్సిన్‌తో పాటు ఔషధంపై కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ -19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా.. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్ జిల్లాలో ఓ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులతో సహా 19 […]

కరోనా కల్లోలం.. ఇద్దరు వైద్యులతో సహా 19 మంది సిబ్బందికి..
Follow us on

కొవిడ్‌-19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం వ్యాక్సిన్‌తో పాటు ఔషధంపై కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ -19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.

తాజాగా.. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్ జిల్లాలో ఓ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులతో సహా 19 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఇటీవల గర్భిణీ మహిళ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిందని, ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. గర్భిణీకి సిజేరియన్ చేసిన ఇద్దరు వైద్యులతోపాటు ఆమెతో కాంటాక్టులో ఉన్న సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ నిర్దారణ అయిందని అధికారులు పేర్కొన్నారు.

Also Read:  తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఈ నెల 13 వరకు రైతుబంధు దరఖాస్తుకు అవకాశం