కమల్ పార్టీని వీడిన ఇద్దరు నేతలు..!

|

Mar 19, 2019 | 8:57 PM

తమిళ నటుడు కమల్ హాసన్ ‘మక్కల్‌నీది మయ్యమ్‌’ అనే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత రాజకీయాల వల్ల ఇద్దరు నాయకులు పార్టీని వీడారు. అందులో ఒకరు యూత్ వింగ్ సెక్రటరీ నవీన్ కార్తీక్ కాగా, మరొకరు కడలూర్ జిల్లా ఇంచార్జ్ వెంకటేశన్. మరోవైపు ఇదే కారణం ఎత్తి చూపి సీకే కుమారవేల్ సోమవారం పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ కోర్ కమిటీ […]

కమల్ పార్టీని వీడిన ఇద్దరు నేతలు..!
Follow us on

తమిళ నటుడు కమల్ హాసన్ ‘మక్కల్‌నీది మయ్యమ్‌’ అనే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత రాజకీయాల వల్ల ఇద్దరు నాయకులు పార్టీని వీడారు. అందులో ఒకరు యూత్ వింగ్ సెక్రటరీ నవీన్ కార్తీక్ కాగా, మరొకరు కడలూర్ జిల్లా ఇంచార్జ్ వెంకటేశన్. మరోవైపు ఇదే కారణం ఎత్తి చూపి సీకే కుమారవేల్ సోమవారం పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ కోర్ కమిటీ సభ్యుడు.

తాజాగా కుమారవేల్ మీడియాతో మాట్లాడుతూ ‘నాలాగే చాలామంది కమల్ హాసన్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. కమల్, ఆఫీస్ బేరర్ల మధ్య సరైన సంబంధాలు లేవు. వాట్సాప్ సందేశాల ఆధారంగానే పార్టీ నడుస్తోందని’ ఆరోపించారు. ఇది ఇలా ఉంటే ఈ ప్రెస్ మీట్ అయిన వెంటనే ఎంఎన్ఎం పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతవరకు అభ్యర్థుల పేర్లు ఖరారు చేయకుండానే ఆయన పోటీ చేసే స్థానంపై వేల్ ప్రకటన చేసి పార్టీ నిబంధనలను ఉల్లఘించడం వల్లే ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాం అని తెలిపింది. కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చి 20న పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.