పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప.. పుష్కరాల విధుల్లో ఉన్న 5 వేల మంది పోలీసులకు పలు సూచనలు

|

Nov 26, 2020 | 10:17 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన పెనుతుఫాన్ నివర్.. తీరం దాటింది. అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం బలహీన పడింది.

పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప.. పుష్కరాల విధుల్లో ఉన్న 5 వేల మంది పోలీసులకు పలు సూచనలు
Follow us on

బంగాళాఖాతంలో ఏర్పడిన పెనుతుఫాన్ నివర్.. తీరం దాటింది. అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం బలహీన పడింది. తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప పోలీసుయంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

పుష్కరాల విధుల్లో ఉన్న 5 వేల మంది పోలీసులకు పలు సూచనలు జారీ చేశారు. సహాయక చర్యలకు ఎస్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు సిధ్దంగా ఉండాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. నది ఉధృతి, నేల మట్టo ప్రవాహాన్ని అప్పుడప్పుడు పరిశీలిస్తుండాలన్నారు. అత్యవసర సేవల కోసం డయల్ 100 లేదా కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08518 -279001 ను వెంటనే సంప్రదించాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు.