తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలపై కీలక నిర్ణయాలు ప్రకటించిన టీటీడీ.. ఈ సమయంలో ఆ పత్రాలు చెల్లవన్న ఈవో

|

Dec 17, 2020 | 7:28 PM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈసారి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఇప్పటికే వైకుంఠ ఏకాదశికి రోజుకు 20వేల చొప్పున టికెట్లను జారీ చేసినట్టు ఈవో జవహర్‌రెడ్డి వెల్లడించారు.

తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలపై కీలక నిర్ణయాలు ప్రకటించిన టీటీడీ.. ఈ సమయంలో ఆ పత్రాలు చెల్లవన్న ఈవో
Tirumala
Follow us on

Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈసారి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఇప్పటికే వైకుంఠ ఏకాదశికి రోజుకు 20వేల చొప్పున టికెట్లను జారీ చేసినట్టు ఈవో జవహర్‌రెడ్డి వెల్లడించారు.

తిరుపతిలో ఉన్న స్థానికుల కోసం ఐదు కౌంటర్లలో టికెట్లను ఇస్తున్నామని స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్దమైన పదవుల్లో ఉన్న నేతలకు కుటుంబసభ్యులతో కలిపి ఐదుగురిని మాత్రమే అనుమతి ఇస్తున్నట్లుగా తెలిపారు. పదవుల్లో లేని వీఐపీలకు మాత్రం వన్‌ ప్లస్‌ త్రీగా అనుమతి ఉంటుందని అన్నారు.

సిఫార్సు లేఖలు ఇవ్వొద్దని ఈవో జవహర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వైకుంట ఏకాదశి దర్శనాల్లో అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాల్లో టికెట్‌ లేకుండా ఎవరినీ అనుమతించమన్నారు టీటీడీ అడిషనల్‌ ఈవో ధర్మారెడ్డి. కోవిడ్‌ కారణంగా రోజుకు కేవలం 35వేల మందికి మాత్రమే దర్శనం ఉంటుందన్నారు. ఏకాదశి పర్వదినాల్లో సిఫార్సు లేఖలు చెల్లవన్న ధర్మారెడ్డి.. అలాంటి వారిని అలిపిరి దగ్గరే ఆపేస్తామన్నారు.