
TTD Decision: ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. నగరాల నుంచి పల్లెల వరకు అన్ని చోట్లా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కరోనాను కట్టడి చేసేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో ప్రతినిత్యం జారీ చేసే మూడు వేల దర్శనం టోకెన్లను తాత్కాలికంగా నిలివేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. రేపటి నుంచి సెప్టెంబర్ 30 వరకు టోకెన్ల జారీని నిలిపేస్తున్నామని టీటీడీ ప్రకటించింది.
Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..