AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. మరోసారి చర్చలకు సిద్ధమైన జేఏసీ

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఐదవ రోజుకి చేరుకుంది. ఐదు రోజులు గడిచినా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం లేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం నో చెబుతోంది. దీంతో తమ డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె ఆపేది లేదని జేఏసీ పెద్దలు పట్టుబట్టి కూర్చుకున్నారు. ఇప్పటికే సమ్మె చేపట్టిన వారిలొ సుమారు 48వేల మందికి పైగా కార్మికులను ఉద్యోగం నుంచి ప్రభుత్వం తొలగించింది. వారి ఖాళీలను భర్తీ చేసేందుకు కొత్త రిక్రూట్ మెంట్లు చేస్తున్నామని అంటోంది. ఉద్యోగాలు పోయినా […]

కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. మరోసారి చర్చలకు సిద్ధమైన జేఏసీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 09, 2019 | 4:28 PM

Share

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఐదవ రోజుకి చేరుకుంది. ఐదు రోజులు గడిచినా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం లేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం నో చెబుతోంది. దీంతో తమ డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె ఆపేది లేదని జేఏసీ పెద్దలు పట్టుబట్టి కూర్చుకున్నారు. ఇప్పటికే సమ్మె చేపట్టిన వారిలొ సుమారు 48వేల మందికి పైగా కార్మికులను ఉద్యోగం నుంచి ప్రభుత్వం తొలగించింది. వారి ఖాళీలను భర్తీ చేసేందుకు కొత్త రిక్రూట్ మెంట్లు చేస్తున్నామని అంటోంది. ఉద్యోగాలు పోయినా సరే తాడో పేడో తేల్చుకుంటామని కార్మికులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

ఇక దీనిపై ఈరోజు మరోసారి ప్రభుత్వ పెద్దలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. భేటీ అనంతరం ఏం చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే తెలంగాణ ఉద్యమం చేపట్టిన సమయంలో సమ్మె చేపట్టిన ఏ ఉద్యోగిని తొలగించనప్పుడు.. సొంత రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలగించడమేంటని జేఏసీ మండిపడుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు ఆర్టీసీకి, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఈ వివాదంలో ప్రతిపక్షాలు జోక్యం చేసుకున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను తొలగించడం పై కాంగ్రెస్ భగ్గుమంది. ఇవాళ అఖిలపక్ష నేతలు కూడా సమావేశమై ప్రభుత్వ నిర్ణయాలపై చర్చించనున్నారు.

మరోవైపు దసరా పండక్కు ఊర్లకు వెళ్లిన ప్రజలు పట్నానికి తిరుగుపయనం అయ్యారు. వారికి ఆర్టీసీ సదుపాయం లేకపోతే ఇప్పుడు కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దసరా వచ్చినప్పుడే సమ్మె జరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సొంతూళ్లకు వెళ్లేందుకు డబుల్, ట్రిపుల్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. ఇక హైదరాబాద్ లాంటి సిటీల్లో కూడా ప్రస్తుతం నడుస్తున్న బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. బస్ పాస్‌లు ఉన్నప్పటికీ.. అవి కూడా చెల్లవని చెబుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దసరా సెలవులు కూడా ముగిసాయి. పాఠశాలలు, కాలేజీలు కూడా మొదలుకాబోతున్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని.. అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ కార్మికులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి.

Follow Us
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!