Permission Permit Room: మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన.. పర్మిట్ రూమ్‌లకు అనుమతి..

Ts Govt Permission To Permit Room: మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం మరో సడలింపు ఇచ్చింది...

Permission Permit Room: మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన.. పర్మిట్ రూమ్‌లకు అనుమతి..

Updated on: Dec 31, 2020 | 3:43 PM

Ts Govt Permission To Permit Room: మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం మరో సడలింపు ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో లైసెన్స్ పర్మిట్ రూమ్‌లకు అనుమతిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో లాక్‌డౌన్ కంటే ముందే మద్యం షాపులు, వాటికి అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్‌లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
లాక్‌డౌన్ తర్వాత ఇచ్చిన సడలింపుల్లో భాగంగా వైన్స్ షాప్‌లు, బార్‌లకు అనుమతిచ్చినప్పటికీ.. పర్మిట్ రూమ్‌లకు అనుమతివ్వలేదనే విషయం విదితమే. అయితే తాజాగా హైదరాబాద్‌లో వీటికి కూడా అనుమతిలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పర్మిట్ రూమ్‌ల వద్ద కోవిడ్ నిబంధనలను పాటించే చూడాలని యాజమన్యాలను ఆదేశించింది. ఇదిలా ఉంటే నగర వ్యాప్తంగా 600 వైన్స్‌లు పర్మిట్ రూమ్‌లకు లైసెన్స్ కలిగి ఉన్నాయి. ఇక డిసెంబర్ 31 సందర్భంగా జంట నగరాల్లో గురువారం మద్యం దుకాణాలకు అర్థరాత్రి 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read: Happy New Year 2021: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో న్యూఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు.. పూర్తి వివరాలివే..