తెలంగాణ ఎంసెట్ పరీక్షల సమయాల్లో మార్పులు..

| Edited By:

Jun 03, 2020 | 11:09 AM

కోవిద్-19 నేపథ్యంలో.. ఎంసెట్ పరీక్ష సమయాల్లో ఉన్నత విద్యా మండలి మార్పులు చేసింది. గతంలో ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని ప్రకటించగా.. తాజాగా ఉదయం

తెలంగాణ ఎంసెట్ పరీక్షల సమయాల్లో మార్పులు..
Follow us on

కోవిద్-19 నేపథ్యంలో.. ఎంసెట్ పరీక్ష సమయాల్లో ఉన్నత విద్యా మండలి మార్పులు చేసింది. గతంలో ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని ప్రకటించగా.. తాజాగా ఉదయం 9 గంటలకు మార్చింది. దీంతో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష జరగనుంది.

అటు ఎడ్‌సెట్, ఐసెట్, పీజీసెట్, లాసెట్ పరీక్షా సమయాల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను అనుసరించి నిర్ణయం తీసుకున్నట్లు అయన వివరించారు. ఆన్‌లైన్‌ పరీక్షలకు హాజరైనవారు వినియోగించిన కంప్యూటర్‌ మౌస్‌లను శానిటైజ్‌ చేయాలని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలు ఇచ్చింది. అది జరగాలంటే ఒక పరీక్ష తర్వాత కనీసం 3 గంటల వ్యవధి అవసరం.

Also Read: కరోనా పేషెంట్లకు ‘రెమిడీసివిర్’.. అత్యవసర పరిస్థితుల్లో 5 డోసులు ఇవ్వొచ్చు..