తెలంగాణ సెట్ (టీఎస్ సెట్) పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫలితాలు వెల్లడించనున్నట్లు బోర్డు ప్రకటించింది. తెలంగాణ సెట్, ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయని బోర్డు తెలిపింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జులై 5, 6 తేదీల్లో మొత్తం 29 బోధనాంశాల్లో ఈ పరీక్షను ప్రభుత్వం నిర్వహించింది.