వచ్చేనెల కరోనా వ్యాక్సీన్ కి ఆమోదం, ఇక వచ్చేసినట్టే ! ట్రంప్

నవంబరులో తమ దేశాధ్యక్ష ఎన్నికలు జరగనుండగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఓటర్లను  మచ్చిక చేసుకునే పనిని వేగవంతం చేశారు. కరోనా వైరస్ వ్యాక్సీన్ ని తమ ప్రభుత్వం వచ్ఛే నెలలో ఆమోదించే అవకాశాలు..

వచ్చేనెల కరోనా వ్యాక్సీన్ కి ఆమోదం, ఇక వచ్చేసినట్టే ! ట్రంప్
Follow us
Umakanth Rao

| Edited By: Team Veegam

Updated on: Sep 15, 2020 | 6:59 PM

నవంబరులో తమ దేశాధ్యక్ష ఎన్నికలు జరగనుండగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఓటర్లను  మచ్చిక చేసుకునే పనిని వేగవంతం చేశారు. కరోనా వైరస్ వ్యాక్సీన్ ని తమ ప్రభుత్వం వచ్ఛే నెలలో ఆమోదించే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. సాధారణంగా అయితే ఇందుకు రెండు, మూడేళ్లు పడుతుందని, కానీ తాము ఇంత త్వరగా ఆమోదించబోవడం విశేషమేనని అన్నారు. ట్రంప్ కనుసన్నలలో నడిచే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రాజకీయ ఒత్తిడితో ఇంత హడావిడిగా ఈ వ్యాక్సీన్ ని ఆమోదించేందుకు సిధ్ధపడిందని, ఇందులో పారదర్శకత లేదని,  ఏదో మతలబు ఉందని అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థి జో  బిడెన్ చేసిన విమర్శలను ట్రంప్ కొట్టి పారేశారు. ఆయనవన్నీ రాజకీయ అబధ్ధాలని అన్నారు.

త్వరలో రాబోయే వ్యాక్సీన్ సురక్షితమైనది చాలా సమర్థవంతమైనది కూడా అని ఆయన ఊరించారు. రేపో, మాపో మీరు సర్ ప్రైజ్ చూస్తారు అని మీడియావారిని ఊదరగొట్టారు.