కేసీఆర్ పనులకు ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఫుల్ ఖుషీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని స్వాగతించారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళనకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని స్వాగతించారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళనకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ‘ఇది చాలా మంచి ప్రక్రియ. తహసీల్దార్ వద్దనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ రెండు కార్యక్రమాలు జరిగేటట్లు అయితే, వ్యవసాయ భూముల కొనుగోలు విక్రయాలు సులభతరం అవుతాయి. సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది’ అని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు.
అంతేకాదు, దివంగత మాజీ ప్రధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలంటూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశాన్నీ ఐవైఆర్ అభినందించారు. ‘సీఎం కేసీఆర్ ఇప్పటికే ఈ అంశంలో స్పష్టమైన నిర్ణయం వెలిబుచ్చారు. మరి నువ్వెప్పుడు కేసీఆర్ బాటలో నడుస్తావు?’ అంటూ ఏపీ సీఎం జగన్ ను ప్రశ్నించారు. ఇక్కడ ఇగో పట్టింపులు అస్సలు ఉండరాదని, తెలంగాణ తరహాలో ఏపీలోనూ తీర్మానం చేయాలని ఐవైఆర్ ఏపీ సీఎంకు హితవు పలికారు.
@ysjagan when are you following this path set by #kcr? No ego issue here . Do it right . https://t.co/MR5R2jg3W7
— IYRKRao , Retd IAS (@IYRKRao) September 8, 2020