AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతుల కోసం చొక్కా తీసేసి యోగాసనలతో నిరసన తెలిపిన ఎమ్మెల్యే

మధ్యప్రదేశ్ లో ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రభుత్వంపై వింత నిరసన వ్యక్తం చేశారు. తాము కోల్పోతున్న భూమికి నాలుగు రెట్లు నష్టపరిహారం కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు.

రైతుల కోసం చొక్కా తీసేసి యోగాసనలతో నిరసన తెలిపిన ఎమ్మెల్యే
Balaraju Goud
|

Updated on: Sep 08, 2020 | 4:55 PM

Share

మధ్యప్రదేశ్ లో ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రభుత్వంపై వింత నిరసన వ్యక్తం చేశారు. తాము కోల్పోతున్న భూమికి నాలుగు రెట్లు నష్టపరిహారం కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. అన్నదాతలకు మద్దతు పలికిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబులాల్ జండేల్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అంతేకాదు, సోమవారం షియోపూర్ కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాబులాల్ శీర్షాసనం వేసి నిరసన తెలిపారు. ఆయనతో మాట్లాడటానికి జిల్లాధికారి రూపేష్ ఉపాధ్యాయ వచ్చినప్పటికీ.. కలెక్టర్ రాకేశ్ శ్రీవాస్తవ రావాల్సిందే అంటూ రైతులు డిమాండ్ చేశారు. కలెక్టర్ శ్రీవాస్తవ రావడానికి అరగంట అలస్యమైంది.. దీంతో రైతులంతా కుర్తా, చొక్కా తీసేసి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇంతలో ఎమ్మెల్యే బాబు జండేల్ కూడా చొక్కా తీసేసి శీర్షాసనం వేసి నిరసన తెలుపడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు.

రైతుల తీరుపట్ల ఆగ్రహంతో ఉన్న కలెక్టర్ మెమోరాండం కూడా తీసుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన అన్నదాతలు.. కలెక్టరేట్ ప్రాంగణంలో మెమోరాండం చదివి గోడకు అతికించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నష్టపోతున్న భూమికి బదులుగా తమకు నాలుగు రెట్లు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏడు రోజుల్లోగా రైతుల డిమాండ్ తీర్చకపోతే వీధుల్లోకి ఎక్కి ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు.

వీరికి ​బొప్పాయి వెరీ డేంజర్..! ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు...
వీరికి ​బొప్పాయి వెరీ డేంజర్..! ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు...
రికార్డుల మ్యాచ్‌కు పొగమంచు గ్రహణం.. టెన్షన్ పెట్టి మరీ రద్దు
రికార్డుల మ్యాచ్‌కు పొగమంచు గ్రహణం.. టెన్షన్ పెట్టి మరీ రద్దు
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో..
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో..
బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడుతున్న పాకిస్తాన్..!
ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడుతున్న పాకిస్తాన్..!
లివర్ వ్యాధికి విరుగుడు.. కాఫీ తాగితే మొత్తం క్లీన్
లివర్ వ్యాధికి విరుగుడు.. కాఫీ తాగితే మొత్తం క్లీన్
ఇదేమి సంస్కారం? ఇలాగేనా ప్రవర్తించేది? కోహ్లీపై నెటిజన్లు ఫైర్
ఇదేమి సంస్కారం? ఇలాగేనా ప్రవర్తించేది? కోహ్లీపై నెటిజన్లు ఫైర్
సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
బీచ్‌లో నడుస్తుండగా కంటపడ్డ చిట్టి ఆక్టోపస్‌..!
బీచ్‌లో నడుస్తుండగా కంటపడ్డ చిట్టి ఆక్టోపస్‌..!