టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే… జాబితాలో సీఎంతోపాటు తొమ్మిది మంది మంత్రులకు చోటు

|

Nov 20, 2020 | 8:14 PM

గ్రేటర్ సమరం మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలను ఎన్నికల అధికారికి అందించారు. అయితే తాజాగా టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆ పార్టీ విడుదల...

టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే... జాబితాలో సీఎంతోపాటు తొమ్మిది మంది మంత్రులకు చోటు
Follow us on

TRS Party Star Campaigners : గ్రేటర్ సమరం మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలను ఎన్నికల అధికారికి అందించారు. అయితే తాజాగా టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మొత్తం 10 మందిని ఆ జాబితాలో చేర్చింది. ఇందుకు సంబంధించిన లిస్ట్‌ను ఎన్నికల సంఘానికి అందజేసింది.

అయితే స్టార్ క్యాంపెయినర్స్ జాబితా సీఎంతో పాటు కేవలం మంత్రులకు మాత్రమే చోటు కల్పించారు. ఇందులో ఇద్దరు మహిళా మంత్రులు.. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో దక్కించుకున్నారు.

  1. కేసీఆర్ (ముఖ్యమంత్రి)
  2.  కేటీఆర్ (టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్)
  3. హరీష్ రావు (మినిస్టర్)
  4. మహమూద్ అలీ (మినిస్టర్)
  5. ఈటల రాజేందర్ (మినిస్టర్)
  6. తలసాని శ్రీనివాస్ యాదవ్ (మినిస్టర్)
  7. కొప్పుల ఈశ్వర్ (మినిస్టర్)
  8. సబితా ఇంద్రారెడ్డి (మినిస్టర్)
  9. పువ్వాడ అజయ్ (మినిస్టర్)
  10. సత్యవతి రాథోడ్ (మినిస్టర్)

గ్రేటర్‌ హైదరాబాద్‌లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉండటంతో రిటర్నింగ్ అధికారుల ముందు అభ్యర్థులు బారులు తీరారు. మూడు గంటల లోపు కార్యాలయంలోకి వచ్చిన వారందరికీ స్లిప్పులు పంపిణీ చేసి నామినేషన్లను స్వీకరించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు 150 డివిజన్లలో నామినేషన్లు వేసి.. బల్దియా బరిలో మిగతా పార్టీల కంటే ముందు నిలిచింది. ఈ సారి గ్రేటర్‌పై కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉన్న బీజేపీ.. అభ్యర్థుల ఎంపికలో కాస్త వెనకబడింది.