చిన్నగా మొదలైన గొడవ కాస్త చిలికి చిలికి పెద్దవానగామారి.. రెండు పార్టీల నేతలు కుమ్మేసుకున్నారు

| Edited By: Sanjay Kasula

Nov 12, 2020 | 8:39 PM

సూర్యాపేట జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులకు మధ్య జరిగిన వాగ్వాదంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

చిన్నగా మొదలైన గొడవ కాస్త చిలికి చిలికి పెద్దవానగామారి.. రెండు పార్టీల నేతలు కుమ్మేసుకున్నారు
Follow us on

సూర్యాపేట జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులకు మధ్య జరిగిన వాగ్వాదంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. చిన్నగా మొదలైన గొడవ కాస్త చిలికి చిలికి పెద్దవానగా మారి ఇరు వర్గాల మధ్య తోపులాటకు కొట్లాటకు దారి తీసింది. నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో టీఆర్ఎస్ – కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ, తోపులాటకు దారితీసింది. వరద బాధితుల లబ్ధిదారుల ఎంపిక ఏకపక్షంగా జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు కౌంటర్ ఇచ్చారు. మాటలతో మొదలైన వాగ్వివాదం కాస్త.. తోపులాటగా మారి.. ఘర్షణకు దారి తీసింది. నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఫైటింగ్ చోటుచేసుకుంది. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఇరు పార్టీలకు చెందిన నేతలు చొక్కాలు పట్టుకున్నారు.