ఎంపీలో వింత శిక్ష.. భర్తను భుజాల‌పై ఊరేగించిన మహిళ..!

|

Jun 20, 2020 | 7:38 PM

వారం రోజుల‌పాటు క‌నిపించ‌కుండా పోయింద‌న్న సాకుతో ఓ మ‌హిళ‌కు ఆమె భ‌ర్త సోద‌రులు వింత శిక్ష విధించారు. భర్తను భుజాల‌పై ఎత్తుకుని ఊరంతా తిప్పించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఝ‌బ్వా జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎంపీలో వింత శిక్ష.. భర్తను భుజాల‌పై ఊరేగించిన మహిళ..!
Glimpse of closing ceremony of Ex Indra 2017, at Vladivostok, in Russia on October 29, 2017.
Follow us on

నాగరికంగా అభివృద్ధి చెందుతున్నా.. అనాగరికపు పోకడలతో గ్రామీణ ప్రాంతాల్లో వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. దురాచారాలకు మహిళలు బలవుతూనే ఉన్నారు. వారం రోజుల‌పాటు క‌నిపించ‌కుండా పోయింద‌న్న సాకుతో ఓ మ‌హిళ‌కు ఆమె భ‌ర్త సోద‌రులు వింత శిక్ష విధించారు. భర్తను భుజాల‌పై ఎత్తుకుని ఊరంతా తిప్పించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఝ‌బ్వా జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఝ‌బ్వా జిల్లాలోని ఓ గిరిజన మహిళ జూన్ 13 నుంచి క‌నిపించ‌కుండా పోయింది. శుక్ర‌వారం రోజు తిరిగి సొంతూరికి చేరుకుంది. దీంతో ఆమె కుటుంబసభ్యులు గ్రామంలో పంచాయితీ పెట్టారు. మహిళకు కఠిన శిక్ష విధించి ఇంట్లో రానివ్వాలని నిర్ణయించారు ఆమె భర్త సోదరులు. భర్తతో మహిళ కాపురం చేయాలంటే అత‌డిని భుజాలపై ఎత్తుకుని ఊరంతా తిప్పాలని షరతు విధించారు. దీంతో ఆమె భ‌ర్త‌ను భుజాల‌పై ఎత్తుకుని ఊరుచుట్టూ తిరిగి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌నపై మధ్యప్రదేశ్ మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గిరిజన మహిళను బహిరంగంగా ఊరేగించడం దారుణమని మండిపడుతున్నారు. బాధ్యులైనవారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మ‌హిళ భ‌ర్త‌, అత‌ని సోద‌రులు మాత్రం ఆమెకు మ‌రో వ్య‌క్తితో ప్రేమ వ్య‌వ‌హారం ఉంద‌ని ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఝ‌బ్వా జిల్లా పోలీసులు కేసు న‌మోదు చేసి నిందితుల‌ను అరెస్ట్ చేసిన దర్యాప్తు చేపట్టారు.