డాక్టర్ దిశ హత్యకేసులోని నిందితులను పోలీసులు నిన్న ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడంతో.. దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందన్నారు. ఆమె మరణించిన ప్రదేశంలోనే.. ఆ మృగాళ్లు మృతి చెందటంతో అందరూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సంచలన ఎన్‌కౌంటర్.. ఓ టాలీవుడ్ రచయిత ఫ్యాన్ పరోక్షంగా ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని నెటిజన్లు దానికి సంబంధించిన ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు.
టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించాడు. తాజాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను ఉద్దేశించి.. ‘దేవుడు ఉన్నాడో లేదో తెలియదు గానీ తెలంగాణలో మాత్రం పోలీస్ రూపంలో ఉన్నాడని’ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు ఓ ఫ్యాన్ రిప్లై ఇస్తూ.. ‘ ఎన్‌కౌంటర్ మీ స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని చమత్కరించాడు.
‘కోనా ఫ్యాన్ క్లబ్’ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ అయిన ఈ ట్వీట్ సారాంశం ఏంటంటే ‘మీరు ఒకవేళ నిందితులను శిక్షించాలంటే.. డాక్టర్ దిశను హత్య చేసిన సంఘటనా స్థలానికి వాళ్ళను తీసుకెళ్లి.. సీన్ రీ- కన్‌స్ట్రక్షన్ చేయండి. అప్పుడు వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. దానితో పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాల్సి వస్తుంది అని పేర్కొంటూ.. కేటీఆర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. ఇంకేముంది కట్ చేస్తే.. సరిగ్గా అదే విధంగా నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఇకపై అఘాయిత్యాలకు పాల్పడేవారి వెన్నులో వణుకు పుట్టాలని చాలామంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Devudu unnado ledo teliyadu gani, Telangana lo matram Police roopam lo unnadu ? justice served. #JusticeForPriyankaReddy
— kona venkat (@konavenkat99) December 6, 2019
Script mede antunnaru pic.twitter.com/gP722pHr6O
— Sandeep M (@sandeep_madapu) December 6, 2019