Treasure Hunt : ప్రకాశం జిల్లాలోని ఆ శివాలయంలో గుప్తనిధులు కలకలం..అర్ధరాత్రి క్షుద్రపూజలు, తవ్వకాలు
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం అనమనమూరు గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేగింది. గ్రామంలోని పురాతన శివాలయంలో గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తున్నట్టు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Treasure Hunt : ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం అనమనమూరు గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేగింది. గ్రామంలోని పురాతన శివాలయంలో గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తున్నట్టు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యక్తులు గ్రామంలో ఉంటూ రాత్రి వేళల్లో గుప్త నిధుల కోసం శివాలయంలో క్షుద్రపూజులు చేసి తవ్వకాలు చేసినట్టు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నివాసముంటున్న ఆయుర్వేద వైద్యుడు ఈ క్షుద్రపూజలు చేస్తూ గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్న వారికి ఆశ్రయమిచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. అతని ఇంట్లో ఉంటున్న కొందరు వ్యక్తులు రాత్రిపూట శివాలయం వద్ద పూజలు నిర్వహిస్తూ పసుపు, కుంకుమ చల్లి అర్ధరాత్రి పూట తిరుగుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో శివాలయంలో గుంత తవ్వడం ఎందుకని అడిగితే బూతులు తిడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.
నెల రోజుల నుంచి భయం భయంగా ఉంటుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కొరిశపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అయితే పోలీసులు విచారణ పేరుతో గ్రామంలోని ఆయుర్వేద వైద్యుడిని అదుపులోకి తీసుకుని తిరిగి విడిచిపెట్టారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు.
Also Read :
Crime News : దొంగతనం చేసి సినిమా స్టైల్లో కథ అల్లింది..స్క్రీన్ ప్లే అయితే చింపేసింది..పోలీసులు షాక్
Drink and Drive : తాగి వాహనం నడిపితే కాలేజీలకు లేఖలు…విద్యార్థులకు సీపీ సజ్జనార్ వార్నింగ్…
Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..