Travel Destinations: ఈ ప్రాంతానికి వెళ్లి మరీ పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి.. ఇదెక్కడో కాదు మన దేశంలోనే..

|

Aug 04, 2024 | 12:32 PM

ఈశాన్య భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి అసోం. బ్రహ్మపుత్ర, బరాక్ నదీ లోయల వెంబడి తూర్పు హిమాలయాలకు దక్షిణాన ఉన్న అసోం సుందరమైన ప్రకృతి దృశ్యం కావ్యంగా నిలుస్తుంది. అవును ఒకవైపు నదులు, మరోవైపు పర్వతాలు అసోం అద్వితీయమైన ప్రకృతి సౌందర్యంతో పాటు సుసంపన్నమైన టీ తోటల గొప్ప సాంస్కృతిక వారసత్వం, తెగలు, గిరిజన వంటకాలు , ఫ్లూరా, జంతుజాలానికి ప్రసిద్ధి చెందింది. అంతేకాదు అంతకు మించి తెలియని ఎన్నో రహాస్యాలు నగర జీవితానికి దూరంగా ఈ అసోం లో ఉన్నాయి. నేటికీ అన్వేషించబడని ఈ ప్రదేశాలకు వెళ్తే మళ్ళీ తిరిగి నగర జీవితంలోకి అడుగు పెట్టడానికి ఇష్టపడరు. ఈ రోజు అసోమ్ లోని అలాంటి తెలియని 7 ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

1 / 7
మజులి : రాష్ట్రంలోని బ్రహ్మపుత్రనదిలో ఉన్న ఒక పెద్ద నదీ ద్వీపం.. అంతేకాదు మజూలి ప్రపంచంలోనే అతిపెద్ద నది-ద్వీపంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ అనేక 'వైష్ణవ సత్రాలు' ఉన్నాయి, ఒకప్పుడు అసోంలో నియో వైష్ణవ ప్రచార సంస్థలు ఉండేవి. ఇక్కడ కొన్ని గ్రామాల్లో మాస్కులు తయారు చేస్తారు. పదిహేనవ శతాబ్దంలో శ్రీమంత శంకరదేవ రాసిన నాటకాలలో ఇటువంటి ముసుగులు ఉపయోగించబడ్డాయి. పురాతన కళను చూడటానికి ఇష్టపదేవారికి బెస్ట్ ఎంపిక మజులి.

2 / 7
మనస్ నేషనల్ పార్క్ - UNESCO గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ఉద్యానవనం. ఇక్కడ బఘ్రా ప్రాజెక్ట్ రిజర్వ్ ఫారెస్ట్ లేదా టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ , ఎలిఫెంట్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి.  ఇది అస్సాం రాష్ట్రంలో హిమాలయాల పాదాల చెంత , భూటాన్లో కొంత విస్తారించి అంటే.. మనస్ నేషనల్ పార్క్ ఉత్తరాన మనస్ నది , భూటాన్ రాష్ట్రం నుంచి దక్షిణాన బన్‌బారి, పల్సిగురి, కటాఝర్ గ్రామాల వరకు, పశ్చిమాన సోన్‌కోష్ నది తూర్పున ధన్‌షిరి నది వరకు విస్తరించి ఉంది. అయితే మానస్ నేషనల్ పార్క్‌ను సందర్శించాలంటే ప్రత్యేకంగా 'పర్మిషన్' తీసుకోవాలి. బ్రహ్మపుత్రానదికి ఉపనది అయిన మానస నది పేరు మీదుగా ఏర్పడింది మనస్ నేషనల్ పార్క్.

3 / 7
సింగ్ఫో టీ గార్డెన్స్: భారతదేశంలో టీ కథ ప్రారంభమైన మారుమూల గ్రామమైన సింగ్ఫో టీ గార్డెన్స్ చూడాలంటే దిబ్రూఘర్ నుంచి సింగ్ఫో గ్రామానికి బస్సులో వెళ్లాలి. టీ మొక్కలు నాటడం నుండి టీ ఆకులు తీయడం వరకు.. టీ ఉత్పత్తికి సంబంధించిన ప్రతి దశను ఇక్కడ చూడవచ్చు. ఈ గార్డెన్ లో వివిధ రుచుల టీల కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ ఉన్నాయి.

4 / 7
హాఫ్లాంగ్: హఫ్లాంగ్ అస్సాంలోని దిమహాసో జిల్లాలో ఉంది. ఎత్తు 512 మీటర్లు. హాఫ్లాంగ్ రాష్ట్రంలోనే ఏకైక హిల్ స్టేషన్. పర్యాటకులను మంత్ర ముగ్ధులను సహజ సౌందర్యం దీని సొంతం. హఫ్లాంగ్ ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉంటుంది. దీంతో ఈశాన్య భారతదేశంలోని స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. సిల్చార్ నుండి హఫ్లాంగ్ వెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుంది.

5 / 7
మైబాంగ్: అస్సాంలో ప్రదిద్ధి చెందినా పిక్నిక్ స్పాట్.  మైబాంగ్ హఫ్లాంగ్ నుండి 45 కి.మీ దూరంలో ఉంది. ఈ ప్రదేశం ఒకప్పుడు అస్సాంలోని కాచారి రాజుల రాజధాని. మైబాంగ్ సందర్శిస్తే ఇప్పటికీ ప్యాలెస్ భాగాలు చూడవచ్చు. దారిలో మీరు అనేక అందమైన జలపాతాలను చూస్తారు. ఆ అద్భుతమైన గ్రామంలో ఆగష్టు నుండి నవంబర్ వరకు పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి. అయితే ఇలా పక్షులు ఇక్కడకు వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం నేటికీ మిస్టరీగా ఉంది.

6 / 7
శివసాగర్ : అహోం పాలకుల రాజధాని శివసాగర్ చారిత్రక నగరం. ఈ చారిత్రక నగరం ఒకప్పుడు బ్రహ్మ సామ్రాజ్యానికి రాజధాని. ఆ పురాతన అహం నిర్మాణాలను చూడాలంటే శివసాగర్ వెళ్లాల్సిందే.

7 / 7
జోర్హాట్: అస్సాంలో ఒక ముఖ్యమైన నగరం. ఇక్కడ మొలాయి ఫారెస్ట్ ప్రధాన ఆకర్షణ. జాదేబ్ మొలాయ్ ఫేంగ్ అనే పెద్దమనిషి జోర్హాట్‌లో పెద్ద అడవిని సృష్టించడానికి 30 సంవత్సరాలుగా చెట్లను నాటాడు. అందుకే నేడు దీనిని మొలాయి ఫారెస్ట్ అని పిలుస్తారు. 'సైలర్ ది మౌంటెన్ మ్యాన్' లాగా ఉంటుంది. అంతేకాదు గిబ్బన్ అభయారణ్యం కూడా పర్యటనకు ప్రసిద్ధి చెందింది.