అక్కడ సెప్టెంబర్ 6 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు!

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో నితీష్ కుమార్ సారథ్యంలోని బీహార్ ప్రభుత్వం సెప్టెంబర్ 6వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. కరోనా వైరస్ కట్టడికి కంటైన్‌మెంట్, బఫర్ జోన్లలో కఠిన చర్యలు

అక్కడ సెప్టెంబర్ 6 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు!

Edited By:

Updated on: Aug 17, 2020 | 4:15 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో నితీష్ కుమార్ సారథ్యంలోని బీహార్ ప్రభుత్వం సెప్టెంబర్ 6వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. కరోనా వైరస్ కట్టడికి కంటైన్‌మెంట్, బఫర్ జోన్లలో కఠిన చర్యలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్ పొడిగింపు కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతోనే పనిచేయాల్సి ఉంటుంది. రైలు, విమాన సర్వీసులు మామూలుగానే పనిచేస్తాయి. అన్ని విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలు మూసే ఉంటాయి. కాగా, బీహార్‌లో కొత్తగా 2,187 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1.04 లక్షలకు చేరింది.

Read More:

ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు.. 16 సెంటీమీటర్లకు పైగా..!

ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో 90 మంది బాలికలకు కరోనా!