టామ్‌ అండ్ జెర్రీ డైరెక్టర్ కన్నుమూత

టామ్ అండ్ జెర్రీ.. ఈ షోకు చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇంత ప్రజాదారణ పొందిన యానిమేటెడ్ క్యారెక్టర్ బహుశా మళ్లీ రాదేమో అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పాత్రలను సృష్టించిన దర్శకుడు జీన్ డిచ్ ఇటీవల..

టామ్‌ అండ్ జెర్రీ డైరెక్టర్ కన్నుమూత

Edited By:

Updated on: Apr 20, 2020 | 8:30 PM

టామ్ అండ్ జెర్రీ.. ఈ షోకు చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇంత ప్రజాదారణ పొందిన యానిమేటెడ్ క్యారెక్టర్ బహుశా మళ్లీ రాదేమో అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పాత్రలను సృష్టించిన దర్శకుడు జీన్ డిచ్ ఇటీవల కన్నుమూశారు. ఈ సీరియల్‌తోనే జీన్ చాలా పేరు ప్రఖ్యాతలు పొందారు. 95 ఏళ్ల వయస్సున్న జీన్ డిచ్ చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలోని తన అపార్టుమెంట్‌లో ఏప్రిల్ 16వ తేదీ గురువారం రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. అయితే ఆయన మరణవార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టామ్ అండ్ జెర్రీ సీరియల్‌కు గానూ ఆయనకి 1960లో బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలింగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.

ముందు జీన్ డిచ్ ఉత్తర అమెరికా వైమానిక దళంలో పని చేశారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలతో ఆయన బయటకి వచ్చేశారు. 1959లో ప్రేగ్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత చిత్ర కళలపై మక్కువ ఉండటంతో అనేక కార్డూన్స్ గీస్తుండే వారు. అలా ఈ క్రమంలో ఆయన మన్రో అనే చిత్రం తెరకెక్కించారు. కాగా టామ్ అండ్ జెర్రీ 13 ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. జీన్ డీచ్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. మొత్తానికి ఈయన మరణంతో లెజెండ్‌ను కోల్పోయామంటూ టామ్ అండ్ జెర్రీ ఫ్యాన్స్ అంతా విషాదంలో మునిగిపోయారు.

Read More: 

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

తాతయ్యకు దేవాన్ష్ జన్మదిన శుభాకాంక్షలు.. ఎలా చెప్పాడంటే..

నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా

లాక్‌డౌన్: టీఎస్ పోలీసుల న్యూ రూల్స్.. రేపట్నుంచి కఠినంగా అమలు

ఈ-పాస్ ఎలా తీసుకోవాలి? ఈ వీడియో చూడండి..