టాలీవుడ్(Tollywood)లో విషాదం చోటుచేసుకుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించాలని ఎన్నో కలలు కన్న ఓ యువ డైరెక్టర్ ఆకస్మాత్తుగా కన్నుమూశాడు. పైడి రమేశ్ అనే యంగ్ డైరెక్టర్.. కరెంట్ షాక్‌తో దుర్మరణం చెందారు. యూసఫ్‌గూడ(Yousufguda)లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న రమేశ్.. బయటకు వాకింగ్ వెళ్లి తిరిగి రూమ్‌కు వచ్చాడు. ఈ క్రమంలో వర్షం స్టార్ట్ అవ్వడంతో.. బాల్కనీలో ఆరేసిన బట్టలు తీసే ప్రయత్నం చేశాడు. గాలికి కొన్ని బట్టలు కరెంట్ తీగలపై పడటంతో రాడ్ సాయంతో వాటిని తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో షాక్ కొట్టి నాల్గో అంతస్తూ నుంచి కింద పడి స్పాట్‌లోనే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా పైడి రమేశ్ గతంలో ‘రూల్’ అనే సినిమా తీశాడు. అది అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. ప్రస్తుతం మరో సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఈ విధంగా జరిగింది. రమేశ్ మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, టెక్నిషియన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: AP: ఆమె నీడ పడితే చనిపోతారట.. తనకు శాపం ఉందని ఊహించని పని చేసిన విద్యార్థిని