Tollywood : హీరో శ్రీకాంత్ ఇంట విషాదం…

Tollywood :  హీరో శ్రీకాంత్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి మేకా పరమేశ్వరరావు(70) ఈరోజు(సోమవారం)  తెల్లవారుజామున రెండున్నర గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన గత నాలుగు నెలలుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ…స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవపాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల.. కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం […]

Tollywood : హీరో శ్రీకాంత్ ఇంట విషాదం...

Updated on: Feb 17, 2020 | 8:37 AM

Tollywood :  హీరో శ్రీకాంత్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి మేకా పరమేశ్వరరావు(70) ఈరోజు(సోమవారం)  తెల్లవారుజామున రెండున్నర గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన గత నాలుగు నెలలుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ…స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవపాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల.. కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో పరమేశ్వరరావు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు.