
ఉత్తర భారతదేశంలో వరుస భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. నంగలోయి ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. నంగలోయితోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. భూమి కపించడంతో ఇళ్లల్లో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
అసోంలోని నౌగామ్‌లో నిన్న ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో3.0 తీవ్రతతో భూమి కంపించింది. భూ అంతర్భాగంలో ఐదు కిలోమీటర్ల లోతులో భూ కదలికలు సంభవించడంతో భూకంపం వచ్చిందని ఎన్‌సీఎస్ తెలిపింది. అలాగే ఈ నెల 17వ తేదీన ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. అలాగే రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతంలోనూ రాత్రి భూకంపం సంభవించింది. ఇలా ఈ మధ్య కాలంలో ఢిల్లీలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ వరుస భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏ సమయంలో భూప్రకంపనలు సంభవిస్తాయోనని భయాందోళన చెందుతున్నారు.
Pan card: కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్: కేవలం 10 నిమిషాల్లోనే పాన్ కార్డు పొందండిలా..