ఢిల్లీలో కొత్తగా 3,229 కరోనా పాజిటివ్ కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నెల రోజుల క్రితం వరకు తక్కువ కేసులు నమోదై ఢిల్లీలో ఇప్పుడు క్రమంగా పెరగడం మొదలుపెట్టింది. తాజాగా ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 3,229 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

ఢిల్లీలో కొత్తగా 3,229 కరోనా పాజిటివ్ కేసులు
Follow us

|

Updated on: Sep 14, 2020 | 9:30 PM

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నెల రోజుల క్రితం వరకు తక్కువ కేసులు నమోదై ఢిల్లీలో ఇప్పుడు క్రమంగా పెరగడం మొదలుపెట్టింది. తాజాగా ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 3,229 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,21,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటించింది. కాగా ఇవాళ ఒక్కరోజే 3,374 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. అయితే సోమవారం కరోనా బారినపడి చనిపోయిన వారి వారి సంఖ్య 26 కాగా, ఢిల్లీ మొత్తం మృతుల సంఖ్య 4,770 చేరుకుంది.

ఇక ఢిల్లీ వ్యాప్తంగా కొవిడ్‌ కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో 1,88,122 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28,641 ఉన్నాయి. సోమవారం ఢిల్లీ వ్యాప్తంగా 9,859 మందికి కరోనా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా, 35,025 మందికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు ఢిల్లీ వ్యాప్తంగా మొత్తంగా కరోనా పరీక్షల సంఖ్య 21,84,316లకు చేరుకుంది. రాజధానిలో హోం ఐసోలేషన్‌లో 16,568 మంది ఉండగా.. కంటైన్మెంట్ జోన్‌లలో 1517 మంది ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా చికిత్సపొందుతున్నారు.