వెంకన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా దీపావళి వేడుకలు, శ్రీవారికి హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే ?

దీపావళి రోజున తిరుమల వెంకన్నను 23,232 మంది భక్తులు దర్శించుకున్నారు. వారు రూ.1.55 కోట్లను మొక్కుబడుల రూపంలో హుండీలో వేశారు.

వెంకన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా దీపావళి వేడుకలు, శ్రీవారికి హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే ?
Follow us

|

Updated on: Nov 15, 2020 | 12:47 PM

దీపావళి రోజున తిరుమల వెంకన్నను 23,232 మంది భక్తులు దర్శించుకున్నారు. వారు రూ.1.55 కోట్లను మొక్కుబడుల రూపంలో హుండీలో వేశారు. 8,400 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. కాగా శ్రీవారి లక్ష్మీ కాసులహారం ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో లక్ష్మీకాసులహారం ఊరేగింపు నిర్వహించారు.

వర్షం కారణంగా మాడవీధుల్లో లక్ష్మీ కాసులహారం ఊరేగింపు రద్దు చేసిన టీటీడీ…శ్రీవారి ఆలయం నుండి వైభవోత్సవ మండపం వరకు ఊరేగింపు నిర్వహించింది. ఊరేగింపు అనంతరం లక్ష్మీకాసుల హారాన్ని తిరుచానూరుకు తీసుకెళ్లారు అధికారులు.  తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో గజవాహనం రోజు అమ్మవారికి శ్రీవారికి లక్ష్మీకాసులహారం అలంకరించడం ఆనవాయితీ వస్తోన్న విషయం తెలిసిందే. ఈరోజు తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే గజవాహన సేవలో అమ్మవారికి లక్ష్మీ కాసులహారం అలంకరించనున్నారు.

శాస్త్రోక్తంగా దీపావళి వేడుకలు : 

తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆస్థాన వేడుకను బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీ మలయప్పస్వామి, అమ్మవార్ల, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి దీపావళి ఆస్థానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కర్పూర మంగళహారతులు సమర్పించారు.

నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు, దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. దీనితో దీపావళి ఆస్థానం పూర్తయింది. అనంతరం టీటీడీ ఉద్యోగులకు తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు.

Also Read : 

పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు, సరిహద్దులో కాల్పుల విరమణకు తూట్లు పొడవడంపై ఆగ్రహం

ఆస్తి పన్ను రాయితీ ఉత్తర్వులు జారీ, ఇప్పటికే చెల్లించిన వారికి వచ్చే ఏడాది సర్దుబాటు

‘కారు మాదే, యాక్సిడెంట్ చేసింది నా కుమారుడు కాదు’ : సైబర్‌ టవర్స్‌ వద్ద ప్రమాదంపై ఎమ్మెల్యే కాటసాని వివరణ