AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల, పనిచెయ్యని టీటీటీ వెబ్‌సైట్, అసహనం వ్యక్తం చేస్తోన్న భక్తులు

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం విడుదల చేసింది. డిసెంబరు నెలకు సంబంధించిన కోటాను టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచింది.

శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల, పనిచెయ్యని టీటీటీ వెబ్‌సైట్, అసహనం వ్యక్తం చేస్తోన్న భక్తులు
Tirumala
Ram Naramaneni
|

Updated on: Nov 30, 2020 | 1:38 PM

Share

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం విడుదల చేసింది. డిసెంబరు నెలకు సంబంధించిన కోటాను టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచింది. ప్రతి రోజూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ఇవ్వనున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లలో ప్రతి రోజూ 19 వేలు ఇవ్వనున్నట్లు ఆలయ అధికారుల తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనల ప్రకారమే భక్తులకు శ్రీ వారి దర్శనం కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఆలయంలో నిత్యం శానిటైజేషన్ చేస్తున్నామని టీటీడీ తెలిపింది. ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులు, ముందుగానే తిరుమలకు చేరుకుని, తమకు కేటాయించిన సమయంలో దర్శనం చేసుకోవాలని పేర్కొంది. వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఈ టికెట్లను పొందాలని, మధ్యవర్తులను ఆశ్రయించి ఇబ్బందులు పడవద్దని టీటీడీ సూచించింది.

కాగా భక్తులు అధిక సంఖ్యలో టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నించడంతో టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ అవ్వడం లేదు. ఇప్పుడే కాదు ప్రతి నెలా టికెట్లు విడుదల చేసిన సమయంలో ఇలానే జరుగుతోందని వారు చెప్తున్నారు. దీనిపై టీటీడీ అధికారులకు సమాచారం చేరవేసినప్పటికీ, వారు సరైన చర్యలు తీసుకోవడం లేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

Also Read :

AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !

Ind vs Aus : రెండో వన్డే​లో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు

Follow Us
ప్రపంచ విజేత టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్
ప్రపంచ విజేత టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్
రాత్రిపూట ఎక్కువ సేపు ఫోన్ చూస్తున్నారా? కళ్లకే కాదు, ఆరోగ్యానికి
రాత్రిపూట ఎక్కువ సేపు ఫోన్ చూస్తున్నారా? కళ్లకే కాదు, ఆరోగ్యానికి
వాట్సప్‌లో సెకన్లలోనే గ్యాస్ బుకింగ్.. జస్ట్ ఈ మెస్సేజ్ పెడితే..
వాట్సప్‌లో సెకన్లలోనే గ్యాస్ బుకింగ్.. జస్ట్ ఈ మెస్సేజ్ పెడితే..
టీమ్ మేనేజ్‌మెంట్‌ను కాల్చి చంపాలి.. మాజీ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
టీమ్ మేనేజ్‌మెంట్‌ను కాల్చి చంపాలి.. మాజీ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
రూ.27.5 కోట్లతో ఫ్లాట్లు కొన్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ హీరో?
రూ.27.5 కోట్లతో ఫ్లాట్లు కొన్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ హీరో?
వార్‌ ఎఫెక్ట్.. కేజీ టమోటా రూ.250, ఉల్లిపాయ 175.. కన్నీళ్లు పెట్ట
వార్‌ ఎఫెక్ట్.. కేజీ టమోటా రూ.250, ఉల్లిపాయ 175.. కన్నీళ్లు పెట్ట
అమ్మో ..ఇదేం భక్తి యాత్ర బాబోయ్.. కాళ్లకు కర్రలు కట్టుకొని..
అమ్మో ..ఇదేం భక్తి యాత్ర బాబోయ్.. కాళ్లకు కర్రలు కట్టుకొని..
వీడు మహా కంత్రీ.. సైబర్ కేటుగాళ్లకే సాయం..!
వీడు మహా కంత్రీ.. సైబర్ కేటుగాళ్లకే సాయం..!
ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకుంటే శుభమా.. అశుభమా..? అపోహలు కాదు..
ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకుంటే శుభమా.. అశుభమా..? అపోహలు కాదు..
మలబద్ధకానికి బట్టతలకు లింకేంటి?.. సర్వేలో షాకింగ్ ఫాక్ట్స్
మలబద్ధకానికి బట్టతలకు లింకేంటి?.. సర్వేలో షాకింగ్ ఫాక్ట్స్