ఈ నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. గత నెలలో జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయానికే పరిమితం చేసి ఏకాంతంగా నిర్వహించిన టీటీడీ నవరాత్రి..

ఈ నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
జులై మాసంలో 7.13 లక్షల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Follow us

|

Updated on: Oct 09, 2020 | 6:10 AM

Navratri Brahmotsavam నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండలు ముస్తాబవుతున్నాయి. ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. గత నెలలో జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయానికే పరిమితం చేసి ఏకాంతంగా నిర్వహించిన టీటీడీ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మాత్రం పరిమిత సంఖ్యలో భక్తులను గ్యాలరీల్లోకి అనుమతిస్తున్నారు.

స్వామివారి వాహనసేవలను మాడవీధుల్లో జరపాలని నిర్ణయించింది. భక్తులు భౌతిక దూరం పాటించేలా నాలుగు మాడవీధుల్లో సర్కిల్‌ మార్కింగ్‌ పనులు గురువారం పూర్తిచేశారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు 15న అంకురార్పణను నిర్వహించనున్నారు.