లఢాఖ్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక వ్యాఖ్యలు

చైనా-భారత్ సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లద్దాఖ్ ప్రతిష్టంభనకు చైనానే కారణమని తేల్చి చెప్పారు.

లఢాఖ్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక వ్యాఖ్యలు
Follow us

|

Updated on: Oct 10, 2020 | 5:28 PM

చైనా-భారత్ సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లద్దాఖ్ ప్రతిష్టంభనకు చైనానే కారణమని తేల్చి చెప్పారు. సైనిక శక్తి ద్వారా వాస్తవాధీన రేఖ వద్ద అజమాయిషీ సాధించేందుకు చైనా ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. చర్చలు, ఒప్పందాల ద్వారా చైనా వక్రబుద్ధి మారదన్నరాబర్ట్.. డ్రాగన్ కంట్రీకి సరియైన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ రాబర్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించుకునేందుకు చైనా సైనిక బలాన్ని ప్రయోగిస్తుందని అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రపంచ ఆర్థికాభివృద్ధి కోసమంటూ చైనా ప్రారంభించిన బెల్ట్ రోడ్ ఇనిషీయేటివ్ కార్యక్రమాన్ని కూడా రాబర్ట్ తప్పుబట్టారు. బీఆర్ఐలో భాగంగా పేద దేశాలు చైనా ఇచ్చిన నిధులను తీసుకుంటూ అప్పుల ఊబిలో కూరుకుపోతాయని మండిపడ్డారు. ప్రమాదకరమైన నిబంధనల కారణంగా అయా దేశాలు స్థాయికి మించి లోన్లు చేరుకుంటున్నాయని ఆయన అన్నారు. అప్పులు తిరగి చెల్లించడం ద్వారా ఆయా దేశాల నిధులన్నీ చైనా కంపెనీలకు చేరుతోందన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని కంపెనీల ఏర్పాటు ద్వారా అయా దేశాల ప్రభుత్వ ఖజానాకు భారంగా మారుతున్నాయని స్పష్టం చేశారు. అప్పుల ఉబిలో కూరుకుపోయిన దేశాలు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోయి చైనా చెప్పినట్టు నడుచుకుంటున్నాయన్నారు.