AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఏంది.. తెలుగబ్బాయ్ అంతమాట అనేశాడా.. ఇషాన్‌ను టార్గెట్ చేస్తూ.. ఏమన్నాడంటే?

Tilak Varma Indirectly Targets Ishan Kishan: టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. తన స్లో బ్యాటింగ్‌తో ట్రెండింగ్ అవుతున్నాడు. ఈ క్రమంలో పార్థివ్ పటేల్‌తో మాట్లాడిన తిలక్ వర్మ కొన్ని కీలక విషయాలు పంచుకున్నాడు.

Video: ఏంది.. తెలుగబ్బాయ్ అంతమాట అనేశాడా.. ఇషాన్‌ను టార్గెట్ చేస్తూ.. ఏమన్నాడంటే?
Ind Vs Pak Tilak Varma
Venkata Chari
|

Updated on: Feb 16, 2026 | 1:46 PM

Share

Tilak Varma Indirectly Targets Ishan Kishan: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో తిలక్ వర్మ 24 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కేవలం రెండు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే కొట్టడంతో, ఈ స్లో ఇన్నింగ్స్‌పై అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. పవర్‌ప్లేలో బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వలేదని, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఇషాన్ కిషన్‌పై తిలక్ వర్మ పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు కనిపించింది.

మ్యాచ్ అనంతరం మాజీ భారత వికెట్‌కీపర్-బ్యాటర్ పార్థివ్ పటేల్‌తో మాట్లాడిన తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌తో తనకు జరిగిన సంభాషణను వెల్లడించాడు. తిలక్ వర్మ చేసిన ‘స్తో’ ఇన్నింగ్స్ తర్వాత భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అతనితో కోపంగా మాట్లాడినట్లు కనిపించింది.

“పవర్‌ప్లేలో బ్యాటింగ్ చేయడం ఈజీగా అనిపించింది”: తిలక్ వర్మ

పవర్‌ప్లేలో బ్యాటింగ్ చేయడం చాలా సులభంగా అనిపించిందని తిలక్ వర్మ అంగీకరించాడు. “పవర్‌ప్లేలో బంతి బ్యాట్‌కు బాగా తగులుతోంది. షాట్లు ఈజీగా కనెక్ట్ అవుతున్నాయి” అని పార్థివ్ పటేల్‌కు తిలక్ వర్మ తెలిపాడు. తిలక్ వ్యాఖ్యల తర్వాత పార్థివ్ పటేల్, ఇషాన్ కిషన్‌ను ప్రశంసిస్తూ మిగతా బ్యాటర్లపై, తిలక్ వర్మపై కూడా పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు.

“ఇషాన్ షాట్లు కొడుతున్న తీరు చూస్తే, మిగతా బ్యాటర్లతో పోలిస్తే అతను వేరే పిచ్‌పై బ్యాటింగ్ చేస్తున్నట్లే అనిపించింది” అంటూ పార్థివ్ సరదాగా వ్యాఖ్యానించాడు.

దీనికి తిలక్ వర్మ స్పందిస్తూ, “ఇషాన్ బాగా కొడుతున్నాడని చూస్తూ నేనూ కొట్టాలని అనుకున్నాను. కానీ, నాకు తగినన్ని స్ట్రైక్స్ రాలేదు. అప్పుడు ఇషాన్ కొడుతుంటే జట్టుకు మంచిదే అనిపించింది. ఒక వికెట్ పడితే నేను స్ట్రైక్ రొటేషన్‌తో ఇన్నింగ్స్‌ను నడిపిస్తాను అని కూడా ఇషాన్‌కు చెప్పాను” అని తన 25 పరుగుల ఇన్నింగ్స్ వెనుక కారణాన్ని వివరించాడు ఈ తెలుగబ్బాయ్.

పాకిస్తాన్‌పై భారత్ ఆధిపత్యం..

మ్యాచ్ విషయానికి వస్తే, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా టాస్ గెలిచి భారత్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ డకౌట్‌గా ఔట్ అవడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

అభిషేక్ ఔట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులతో మెరిశాడు. తిలక్ వర్మ (25), సూర్యకుమార్ యాదవ్ (32), శివం దూబే (27) కీలక సహకారాలు అందించడంతో భారత్ 20 ఓవర్లలో 175/7 స్కోరు చేసింది.

లక్ష్య చేజ్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ క్రమం పూర్తిగా కుప్పకూలింది. తొలి 4.5 ఓవర్లలోనే 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. తర్వాత మధ్య వరుస కూడా విఫలమైంది. వికెట్‌కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ 34 బంతుల్లో 44 పరుగులు (ఆరు ఫోర్లు, ఒక సిక్స్) చేసి కొంత పోరాటం చూపించాడు.

ఇన్నింగ్స్ చివర్లో షాహీన్ అఫ్రిది మాత్రమే 19 బంతుల్లో 23 పరుగులు చేసి 20 పరుగుల మార్క్ దాటాడు. మిగతా ఏడుగురు పాకిస్తాన్ బ్యాటర్లు డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయారు. చివరికి పాకిస్తాన్ 114 పరుగులకే ఆలౌట్ కాగా, భారత్ 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us