ప్రాణాల మీదకు తెచ్చిన ఈత సరదా.. గుండాల ప్రాజెక్టులో మునిగి ముగ్గురు యువకుల గల్లంతు

|

Dec 20, 2020 | 4:30 PM

ఖమ్మం జిల్లాలో ఈత సరదా ముగ్గురు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఈత కొట్టేందుకు గుండాల ప్రాజెక్టులోకి దిగిన ముగ్గురు స్నేహితులు గల్లంతయ్యారు. పెనుబల్లి మండలంలోని..

ప్రాణాల మీదకు తెచ్చిన ఈత సరదా.. గుండాల ప్రాజెక్టులో మునిగి ముగ్గురు యువకుల గల్లంతు
Follow us on

ఖమ్మం జిల్లాలో ఈత సరదా ముగ్గురు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఈత కొట్టేందుకు గుండాల ప్రాజెక్టులోకి దిగిన ముగ్గురు స్నేహితులు గల్లంతయ్యారు. పెనుబల్లి మండలంలోని పులిగుండాల జలాశయంలో దిగి ముగ్గురు యువకులు మునిగారు. సరదాగా ఈతకు వెళ్లిన యువకులు నీట మునగడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 8 మంది స్నేహితుల బృందం పులిగుండాల ప్రాజెక్టు వద్దకు వెళ్లింది. వీరిలో ఐదుగురు ఈతకు దిగారు. ఎవరికి సరియైన ఈత రాకపోవడంతో.. నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దర్ని స్థానికులు రక్షించారు. అయితే మిగిలిన ముగ్గురు జంగా గుణ (24), శీలం చలపతి (25), వేమిరెడ్డి సాయి (25) గల్లంతయ్యారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారికోసం గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. గల్లంతైన ముగ్గురు యువకులు కల్లూరు మండలం బత్తలపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.