దీదీని చంపితే కోటి.. ఎవరిదా వార్నింగ్.?
పశ్చిమ బెంగాల్‌లోని పరిస్థితులు నానాటికి ఉద్రిక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య మొదలైన ఘర్షణలు ఇప్పటీకీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ లెటర్ బెంగాల్‌లో కలకలం సృష్టిస్తోంది. సీఎం మమతా బెనర్జీ చంపితే కోటి ఇస్తామంటూ రాసిన ఈ లేఖపై తృణమూల్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. అసలు వివరాల్లోకి వెళ్తే ఆరాంబాగ్ ఎంపీ అపురూప పొద్దార్‌కు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది. దీదీని చంపి తల […]
పశ్చిమ బెంగాల్‌లోని పరిస్థితులు నానాటికి ఉద్రిక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య మొదలైన ఘర్షణలు ఇప్పటీకీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ లెటర్ బెంగాల్‌లో కలకలం సృష్టిస్తోంది. సీఎం మమతా బెనర్జీ చంపితే కోటి ఇస్తామంటూ రాసిన ఈ లేఖపై తృణమూల్ నేతలు పోలీసులను ఆశ్రయించారు.
అసలు వివరాల్లోకి వెళ్తే ఆరాంబాగ్ ఎంపీ అపురూప పొద్దార్‌కు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది. దీదీని చంపి తల తెచ్చినా.. సజీవంగా తీసుకొచ్చినా వారికి కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా మమతా బెనర్జీ ఫోటోని మార్ఫింగ్ చేసి.. ఈ లేఖతో పంపారట. కాగా ఈ లేఖ రాజ్‌వీర్ కిల్లా అనే వ్యక్తి పేరుపై రాయగా.. ఎంపీ అపురూప శ్రీరామ్‌పూర్ పోలీసులకు లేఖను అప్పగించి.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఇది ఇలా ఉండగా రాజీవ్ కిల్లా అనే వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయి.. ఎవరో తనపై కుట్రపన్నారని..తనకు ఈ లేఖతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. అయితే గతంలో దీదీని జైశ్రీరామ్ నినాదాలతో ఇబ్బంది పెట్టిన బీజేపీ కార్యకర్తలే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని తృణమూల్ నేతలు ఆరోపించారు. ఇక పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు.