ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు.. ఆందోళనలో అధికారులు

కర్నాటకలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్న‌ది.  రోజూ వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు.. అంటే గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 6,495 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది.

ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు.. ఆందోళనలో అధికారులు

Updated on: Aug 31, 2020 | 8:13 PM

కర్నాటకలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్న‌ది.  రోజూ వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు.. అంటే గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 6,495 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది.

దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,42,423కు చేరింది. అందులో 2,49,467 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 87,235 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా క‌ర్ణాట‌క‌లో భారీగానే న‌మోద‌వుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 113 మంది క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 5,702కు చేరింది. క‌ర్ణాట‌క ఆరోగ్య‌శాఖ మంత్రి ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. గతంలో మెట్రో ప్రాంతంలోనే అధికంగా పాజిటివ్ కేసు వస్తుండేవి.. కానీ ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో కూాడా కేసు పెరుగుతున్నాయి. దీంతో జిల్లా అధికారుల్లో ఆందోళన నెలకొంది.