Viral: పిల్లి వల్ల సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా నష్టం.. 60వేల ఇళ్లకు కరెంట్‌ కట్..

|

Mar 24, 2022 | 9:46 AM

ఒక్క పిల్లితో వంద కోట్ల రూపాయల నష్టం..7వేల ఇండస్ట్రీస్‌, 60వేల ఇళ్లకు కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిల్లికి, పవర్‌ కట్‌కు సంబంధమేంటి..?

Viral:  పిల్లి వల్ల సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా నష్టం.. 60వేల ఇళ్లకు కరెంట్‌ కట్..
Cat causes power outage
Follow us on

Maharashtra: ఒక్క పిల్లి వల్ల 60 వేల ఇళ్లకు విద్యుత్​ నిలిచిపోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. మహారాష్ట్ర, పుణెలోని పింప్రిచించ్‌వాడ్‌లో జరిగింది ఈ ఘటన. భోసరీ, భోసరీ ఎంఐడీసీ, ఓకుర్ది ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఏకంగా 60వేల మంది వినియోగదారులు..అంధకారంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 7వేల వ్యాపార సముదాయాలకు పవర్‌ కట్‌ అయింది. సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. పింప్రి(Pimpri)లోని భోసారి పారిశ్రామిక ప్రాంతంలో 220కేవీ సబ్‌ స్టేషన్‌ లో ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కింది ఓ పిల్లి..షార్ట్‌ సర్క్యూట్‌తో ఆ పిల్లి చనిపోయింది. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అది పారిశ్రామిక ప్రాంతం కావడంతో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఇండస్ట్రియల్‌ ఏరియాలో పవర్​ కట్​పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు భోసరీ MIDCఎ వ్యాపారులు. ఇది MSEDCLఅధికారుల నిర్వహణ లోపమని ఆరోపించారు. పవర్​ కట్​ ద్వారా తమ వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, సుమారు వంద కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపిస్తోంది పింప్రి-చించ్​వడ్​ స్మాల్‌ కేర్‌ ఇండస్ట్రీస్‌ సంఘం. ఈ అంశంపై విద్యుత్తు శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించి సమస్యను వీలైనంత తొందరగా తీర్చాలని డిమాండ్​ చేశారు. ఐతే ఈ పవర్​ కట్​ మరో మూడు రోజుల వరకు కొనసాగవచ్చంటున్నారు అధికారులు. ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తున్నామని..ప్రత్యామ్నాయమార్గాల ద్వారా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామంటున్నారు. ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని, ఒకే ట్రాన్స్​ఫార్మర్​పై లోడ్​ మొత్తం పడుతుందంటున్నారు MSEDCLఅధికారులు.

Also Read: Telangana: సామాన్యుడికి మరో షాక్.. విద్యుత్ చార్జీల పెంపు.. యూనిట్‌కు ఎంతంటే..?