Viral Video: బాటిల్‌తో మేకకు పాలు పడుతున్న శునకం.. క్యూట్ వీడియో మీ కోసం

|

Jul 03, 2021 | 8:31 PM

జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో రోజూ తారసపడుతూనే ఉంటాయి. అది ఏ ఫ్లాట్‌ఫామ్ అయినా సరే వాటి కోసం ఓ ప్రత్యేకమైన...

Viral Video: బాటిల్‌తో మేకకు పాలు పడుతున్న శునకం..  క్యూట్ వీడియో మీ కోసం
Dog Feeds Goat
Follow us on

జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో రోజూ తారసపడుతూనే ఉంటాయి. అది ఏ ఫ్లాట్‌ఫామ్ అయినా సరే వాటి కోసం ఓ ప్రత్యేకమైన స్పేస్ ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన ఒక వీడియో తెగ సర్కులేట్ అవుతుంది. అందులో కుక్క ఓ బాటిల్ సాయంతో బుజ్జి మేకకు పాలు పడుతుంది. రెండు జంతువులు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ క్యూట్ వీడియోను ట్విట్టర్‌లో బ్యూటెంగేబీడెన్ అనే యూజర్ పంచుకున్నారు. సదరు యూజర్ ఇలాంటి వీడియోలను నిత్యం పోస్ట్ చేస్తూనే ఉంటారు.  “గుడ్ బాయ్” అనే క్యాప్షన్‌తో షేర్ చేయబడిన ప్రస్తుత వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటుంది.

ఆ వీడియోపై మీరూ ఓ లుక్కెయ్యండి

ఈ చిన్న వీడియో క్లిప్‌లో కుక్క పాల బాటిల్‌ను నోటిలో వాలుగా పట్టుకోవడం మనం గమనించవచ్చు. మరోవైపు నుంచి మేక  ఆ బాటిల్‌లోని పాలను ఎంతో ఆత్రంగా త్రాగడం చూడవచ్చు. మేకకు అమ్మ స్థానంలో ఉండి శునకం పాలు పట్టడం మనసులను తాకుతుంది. దీని ద్వారా ఓ మంచి పాజిటివ్  వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం.  ఇది మీ రోజును ఖచ్చితంగా ప్రకాశవంతం చేస్తుందని మేము మీకు హామీ ఇస్తున్నాము.

Also Read: క్రేజీ పెళ్లికొడుకు.. అకస్మాత్తుగా వధువు పాదాలకు మొక్కాడు.. ఆమె రియాక్షన్ చూస్తే వావ్ అంటారు

దొంగతనం చేయడానికి వచ్చాడు.. అనంతలోకాలకు వెళ్లిపోయాడు.. అసలు ఏం జరిగిందంటే