భారత్ బయోటెక్ కంపెనీ కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఈ నెల 20 నుంచి హర్యానాలో పార్రంభం కానున్నాయి. ఇందుకు మంత్రి అనిల్ విజ్ తనకు తాను తొలి వలంటీర్ గా పేరు నమోదు చేసుకున్నారు. వాక్సినేషన్ చేయించుకోవడానికి తాను ఫస్ట్ వాలంటీర్ అయ్యానని ఆయన ట్వీట్ .చేశారు. హర్యానా నుంచి ఢిల్లీకి వస్తున్న వారివల్లే తమ నగరంలో కరోనా వైరస్ కేసులు పెరుతున్నాయన్న ఢిల్లీ ప్రభుత్వ ఆరోపణను ఆయన ఖండించారు. మొదట మీ రాష్టంలో కేసులను తగ్గించుకోవడానికి గట్టి చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
ఇండియాలో ప్రస్తుతం 5 వ్యాక్సీన్స్ వివిధ దశల ట్రయల్స్ లో ఉన్నాయి. సీరం ఇన్స్ టి ట్యూట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వంటి కంపెనీలు ఈ ట్రయల్స్ విషయంలో బిజీగా ఉన్నాయి. ఎంత త్వరగా ఈ టీకా మందును దేశంలో అందుబాటులోకి తీసుకురావాలా అని ఇవి ప్రయత్నిస్తున్నాయి. మొదట కోవాగ్జిన్ టీకా మందుపై ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు.