క్యాష్ వదిలేసి ఉల్లిపాయలు ఎత్తుకెళ్లిన దొంగలు!

| Edited By: Srinu

Nov 29, 2019 | 4:03 PM

దేశంలో ఉల్లి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాటి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మంచి రకం ఉల్లి ధర మార్కెట్‌లో కిలో రూ.100 పలుకుతోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని సుతహతా ప్రాంతంలో విచిత్రం జరిగింది. ఒక దుకాణంలో జరిగిన దొంగతనంలో డబ్బుకు బదులుగా ఉల్లిపాయలు దొంగిలించారు. అక్షయ్ దాస్, మంగళవారం ఉదయం తన దుకాణం తెరిచినప్పుడు వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిఉండడం గమనించాడు. అయితే నగదు పెట్టెలో ఉంచిన డబ్బు చెక్కుచెదరకుండా అలాగే ఉంది, […]

క్యాష్ వదిలేసి ఉల్లిపాయలు ఎత్తుకెళ్లిన దొంగలు!
Follow us on

దేశంలో ఉల్లి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాటి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మంచి రకం ఉల్లి ధర మార్కెట్‌లో కిలో రూ.100 పలుకుతోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని సుతహతా ప్రాంతంలో విచిత్రం జరిగింది. ఒక దుకాణంలో జరిగిన దొంగతనంలో డబ్బుకు బదులుగా ఉల్లిపాయలు దొంగిలించారు. అక్షయ్ దాస్, మంగళవారం ఉదయం తన దుకాణం తెరిచినప్పుడు వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిఉండడం గమనించాడు. అయితే నగదు పెట్టెలో ఉంచిన డబ్బు చెక్కుచెదరకుండా అలాగే ఉంది, కానీ ఉల్లిపాయలు ఉన్న బస్తాలు దొంగిలించబడ్డాయి. వాటి విలువ దాదాపు 50 వేల రూపాయలు. కొన్ని వెల్లుల్లి మరియు అల్లం బస్తాలను కూడా దోచుకున్నారని దాస్ వివరించారు.