పరీక్షలంటేనే పిల్లలు భయపడుతూంటారు. అందులో ఏం వస్తాయో? ఇంకా ఏం చదవాలో అని గాబరా పడిపోతూ ఉంటారు. ఈ కారణంగా ఆత్మనూన్యత లోపిస్తుంది. భయం పెరుగుతుంది. దీంతో మెదడుపై ఒత్తిడి పెరిగి.. ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. మరి పరీక్షల సమయాల్లో పిల్లలు ఎలా ఉండాలి? దానికి తల్లిదండ్రులు ఏం చేయాలి? అనే చిన్న టిప్స్ మీకోసం అందిస్తోంది టీవీ9 వెబ్ సైట్. మరి అవేంటో ఓ లుక్కేసేయండి.
1. ముందుగా పిల్లల్లో పరీక్షల భయం పోగొట్టాలంటే.. తల్లిదండ్రులు వారిలో ముందు నుంచీ ఆలోచనా జ్ఞానం పెంచాలి. జరిగింది చిన్న విషయమేనని.. ప్రయత్నిస్తే మళ్లీ సాధ్యమవుతుందని చెప్పాలి.
2. మార్కుల విషయంలో వారితో కోపంగా కాకుండా.. వాళ్లకి అర్థమయ్యే విధంగా చెప్పడం మంచి పద్దతి.
3. ఎన్ని పనులున్నా సరే.. పరీక్షల సమయంలో.. పిల్లలతో కూర్చొని వారితో మాట్లాడటం మంచింది.
4. ఇక అలాగే.. వారికి మంచి ఆహారం కూడా అందించాలి. కోడిగుడ్లు తినడం వల్ల న్యూరో ట్రాన్స్ మీటర్స్ చురుగ్గా పనిచేస్తాయి. ఇవి మెదడు పనితీరును వేగవంతం చేస్తాయి.
5. పరీక్షల సమయంలో వాల్ నట్స్ తింటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. ఇవి మెదడుకు బూస్టర్స్‌గా పని చేస్తాయి
6. ఆకు కూరల్లో బ్రెయిన్ ప్రొటెక్టివ్‌కు సహాయపడే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
7. అవకాడో జ్యూస్ వారానికి రెండు సార్లు తాగించడం ద్వారా బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. వీటిలో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.
8. అలాగే ఎగ్జామ్‌కి ముందు చాక్లెట్ తింటే చాలా మంచింది.