AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swappable Battery Bikes: రెండు బ్యాటరీలు కలిగిన బెస్ట్ స్కూటర్లు ఇవే.. ఒకటి చార్జింగ్ అయిపోతే మరొకటి.. ఇబ్బందే ఉండదు..

కంపెనీలు కూడా కొత్త టెక్నాలజీలతో కూడిన స్కూటర్లు, బైక్ లను లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీని కంపెనీలు ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటున్నాయి. స్వాపబుల్ బ్యాటరీ అంటే మార్చుకోదగిన బ్యాటరీలు అన్నమాట.

Swappable Battery Bikes: రెండు బ్యాటరీలు కలిగిన బెస్ట్ స్కూటర్లు ఇవే.. ఒకటి చార్జింగ్ అయిపోతే మరొకటి.. ఇబ్బందే ఉండదు..
Bounce Infinity
Madhu
|

Updated on: Jun 09, 2023 | 4:15 PM

Share

ఇటీవల భారతీయ ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లు అధికంగా జరుగుతున్నాయి. కంపెనీలు కూడా కొత్త టెక్నాలజీలతో కూడిన స్కూటర్లు, బైక్ లను లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీని కంపెనీలు ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటున్నాయి. స్వాపబుల్ బ్యాటరీ అంటే మార్చుకోదగిన బ్యాటరీలు అన్నమాట. అంటే ఒక బ్యాటరీ చార్జింగ్ అయిపోయినప్పుడు, దాని స్థానంలో మరొకటి పెట్టుకొని వెళ్లపోవచ్చన్నమాట. ఈ టెక్నాలజీతో కూడిన స్కూటర్లు మన దేశంలో కూడా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1..

మన దేశంలోని అత్యంత తక్కువ ధర ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఇది ఒకటి. దీని ధర కేవలం రూ. 89,999 మాత్రమే.1.9KWh సామర్థ్యంతో లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీనిని స్వాపింగ్ స్టేషన్‌లలో మార్చుకోవచ్చు. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. సింగిల్ ఛార్జ్ పై 85 కి.మీ రేంజ్ ఇస్తుంది. గరిష్టంగ 65కిమీ వేగంతో ప్రయాణించవచ్చు.

గోగోరో 2 సిరీస్..

తైవాన్‌కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు గోరోరో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఈ కంపెనీ నుంచి గొగోరో 2 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ మన దేశంలో లాంచింగ్ సిద్ధమైంది. రెండు వెర్షన్లలో ఈ స్కూటర్ వస్తుంది. రెండూ కూడా గొగోరో2, గొగోరో 2 ప్లస్. ఈ రెండూ గంటకు గరిష్టంగా 87 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. గొగోరో 2లో 7.2 kW, గొగోరో 2 ప్లస్ లో 6.4 kW సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ లు ఉంటాయి. రెండూ స్వాపబుల్ టెక్నాలజీతో ఉంటాయి. సింగిల్ బ్యాటరీ సింగిల్ చార్జ్ పై గొగోరో2 85కిలోమీటర్లు, గొగోరో2 ప్లస్ 97 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అదే స్వాపబుల్ బ్యాటరీతో కలిపితే దాదాపు 170 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

హోండా ఈఎం1..

హోండా కంపెనీ నుంచి 2024 నాటికి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మన దేశంలో లాంచ్ కానున్నాయి. వాటిల్లో ఒకటి ఫిక్స్ డ్ బ్యాటరీ కాగా.. మరొకటి స్వాపబుల్ బ్యాటరీతో వస్తుంది. స్వాపబుల్ బ్యాటరీతో వస్తున్న స్కూటర్ ఈఎం1. ఇది గరిష్టంగా సింగిల్ చార్జ్ పై 48కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ ఇంకా విడుదల చేయలేదు.

సుజుకీ ఈ బుర్గ్ మన్..

ఈ స్కూటర్ ని టోక్యోలోని జోనాన్ లో కంపెనీ పరీక్షిస్తోంది. త్వరలోనే భారతీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనిలో కూడా స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీని కంపెనీ వినియోగిస్తోంది. ఇది గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుతుంది. బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 44కిమీల మైలేజీని అందిస్తుంది.

బాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్..

న్యూ ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ బాజ్ బైక్స్ గిగ్ స్వాపబుల్ బ్యాటరీతో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర బ్యాటరీ లేకుండా రూ. 35,000 ఎక్స్ షోరూం ఢిల్లీ గా ఉంది. ఇది ఆటోమేటెడ్ బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ టూల్స్‌తో వస్తుంది. బ్యాటరీలు ఏఐఎస్ 156 ప్రమాణం ద్వారా సిఫార్సుతో కూడిన భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయి. బ్యాటరీలకు ఐపీ 68 రేటింగ్ కూడా ఉంది. బ్యాటరీలు వాటర్‌ప్రూఫ్ షాక్‌ప్రూఫ్‌గా ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us