సై అంటే సై… ఇంటి పట్టాలు, టిడ్కో ఇళ్లపై చర్చ.. ఒక్కసారిగా హీటెక్కిన సభ.. చంద్రబాబు తీరుపై స్పీకర్ ఆగ్రహం..

|

Dec 01, 2020 | 4:27 PM

ఏపీ అసెంబ్లీలో అదే సీన్ రిపీట్ అయ్యింది. కానీ ఈ రోజు స్పీకర్ వర్సెస్ ప్రతిపక్ష నేత మధ్య హాట్ హాట్ డైలాగ్ వార్ చోటు చేసుకుంది. అప్పటి వరకు ప్రశాంతంగా జరిగిన అసెంబ్లీలో ఒక్కసారిగా గందరగోళం చోటు చేసుకుంది.

సై అంటే సై... ఇంటి పట్టాలు, టిడ్కో ఇళ్లపై చర్చ.. ఒక్కసారిగా హీటెక్కిన సభ.. చంద్రబాబు తీరుపై స్పీకర్ ఆగ్రహం..
Follow us on

Speaker vs Chandrababu : ఏపీ అసెంబ్లీలో అదే సీన్ రిపీట్ అయ్యింది. కానీ ఈ రోజు స్పీకర్ వర్సెస్ ప్రతిపక్ష నేత మధ్య హాట్ హాట్ డైలాగ్ వార్ చోటు చేసుకుంది. అప్పటి వరకు ప్రశాంతంగా జరిగిన అసెంబ్లీలో ఒక్కసారిగా గందరగోళం చోటు చేసుకుంది. ఇంటి పట్టాలు, టిడ్కి ఇళ్లపై చర్చలో తనకు అవకాశం ఇవ్వడం లేదని స్పీకర్‌ తీరును తప్పుబట్టారు చంద్రబాబు.

ఆ సమయంలో స్పీకర్ వైపు వేలెత్తి చూపించారు. దాంతో స్పీకర్‌ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో ఉన్న పేపర్లను విసిరేశారు. అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా తన చేతిలో ఉన్న పేపర్లను విసిరేశారు. ఎంతసేపటికీ తనకు అవకాశం ఇవ్వరా అని నిలదీశారు. దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రతిపక్ష సభ్యులంతా స్పీకర్‌ వైపు దూసుకొచ్చారు.