Strain virus: దేశంలో కరోనా వైరస్‌ను మరువక ముందే మరో కొత్త రకం కరోనా వైరస్ మరింత భయపెడుతోంది. యూకేలో మొదలైన ఈ కొత్తరకం స్ట్రేయిన్ వైరస్ తాజాగా దేశాలకు మెల్ల మెల్లగా పాకుతోంది. ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతున్న జనాలు ఈ కొత్త రకం స్ట్రేయిన్ వైరస్‌తో భయాందోళనకు గురవుతున్నాయి. తాజాగా ఈ కొత్త రకం వైరస్‌పై తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీపీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు. యూకే స్ట్రైయిన్ వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని అన్నారు.
అయితే స్ట్రైయిన్ వైరస్‌కు కోవిడ్ వైద్యం వర్తిస్తుందని డీపీహెచ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ 150 మందిని ఐసోలేషన్‌లో ఉంచామని, కొత్త సంవత్సరం వేడుకలకు అందరూ దూరంగా ఉండాలని సూచించారు. అలాగే కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ఇప్పటికి కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో తగ్గలేదని, అలాగే ఈ కొత్తరకం స్ట్రైయిన్ వైరస్ మరింత ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ స్ట్రైయిన్ వైరస్‌పై వస్తున్న పుకార్లను నమ్మి మరింత ఆందోళనకు గురి కావొదన్నారు. ఎవరి జాగ్రత్తల్లో వారు ఉంటే మంచిదన్నారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మర్చిపోవద్దన్నారు.