కొత్త మున్సిపల్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..

| Edited By:

Sep 21, 2019 | 3:50 PM

తెలంగాణ అసెంబ్లీలో ఐటీ పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణ మున్సిపల్ సవరణ బిల్లు 2019కి ఆమోదం లభించింది. సభ్యులందరూ ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించారు. దీంతో బిల్లుకు సంబంధించిన వివరాలన్నింటినీ సభలో కేటీఆర్ వెల్లడించారు. అవినీతికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా సేవలు ఉంటాయని మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇక కేసీఆర్ కూడా మొదటి నుంచి ఈ చట్టంపై ప్రజలకు భరోసా ఇస్తూ వచ్చారు. అందుకే.. మున్సిపల్ ఎన్నికలు కూడా ఈ […]

కొత్త మున్సిపల్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..
Follow us on

తెలంగాణ అసెంబ్లీలో ఐటీ పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణ మున్సిపల్ సవరణ బిల్లు 2019కి ఆమోదం లభించింది. సభ్యులందరూ ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించారు. దీంతో బిల్లుకు సంబంధించిన వివరాలన్నింటినీ సభలో కేటీఆర్ వెల్లడించారు. అవినీతికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా సేవలు ఉంటాయని మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇక కేసీఆర్ కూడా మొదటి నుంచి ఈ చట్టంపై ప్రజలకు భరోసా ఇస్తూ వచ్చారు. అందుకే.. మున్సిపల్ ఎన్నికలు కూడా ఈ చట్టం ఆమోదం పొందిన తర్వాతే నిర్వహించాలని చెప్పారు.

రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో, నగరాల్లో పాలన కోసం ఆరు వేరువేరు చట్టాలు అమలులో ఉన్నాయి. ఇవన్నీ చాలా పురాతనమైనవి. పట్టణ పరిపాలనలో ఎన్ని బిల్లులు, చట్టాలు అమల్లోకి వచ్చినప్పటికీ.. వాటిలో ఉన్న లోపాల కారణంగా కార్యచరణ సక్రమంగా ముందుకు సాగడం లేదు. ఇక తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-1965, తెలంగాణ మున్సిపల్ చట్టం-1994, టౌన్ మరియు కంట్రీ ప్లానింగ్ చట్టం-1920, అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ చట్టం-1975, జీహెచ్‌ఎంసీ యాక్ట్-1955, హెచ్‌ఎండీఏ యాక్ట్-2008 చట్టాలను ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులకు తగ్గట్లు రూపొందిచారు.