కాదేది కవితకనర్హం అన్నట్టుగా… ఈ జనరేషన్ జనాలు కాదేది ట్రెండింగ్‌కు అనర్హం అంటున్నారు.. ఒకప్పుడు ఏదైనా టాపిక్ ట్రెండ్ కావాలి అంటే అందులో చాలా విషయం ఉండాలి. కానీ ఇప్పుడు అంత సీన్ అవసరం లేదు. సిల్లీ టాపిక్స్ కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి.. లేటెస్ట్‌గా కాజల్ అగర్వాల్ పేరు కూడా అలాగే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఆదివారం.. కాజల్ అగర్వాల్ బర్త్‌డే… కాదు..! పెళ్లి రోజు అనుకునే ఛాన్సే లేదు.. పోనీ ఫస్ట్ మూవీ రిలీజ్ డేటా..? దానికింకా టైం ఉంది. ఇలా ఫలానా రీజనంటూ ఏదీ లేకపోయినా… చందమామ పేరు నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అయ్యింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే.. కేజీఎఫ్ అప్‌డేట్ లాంటి హాట్ ఇష్యూస్ ఉన్నా కూడా కాజల్ పేరు నెటిజెన్స్‌ను షేక్ చేసింది.
‘కాజలిజం డే’ అంటూ అమ్మడి పేరును మోత మోగించారు ఫ్యాన్స్.. కాజల్ పెళ్లి రోజున ఏ రేంజ్‌లో అయితే ట్రెండ్స్ కనిపించాయో.. అంతకు మించి అనే స్థాయిలో ట్రెండ్స్ కనిపించాయంటే అమ్మడి రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాజల్ అభిమాన గణం డిసెంబర్ 20ని వరల్డ్ కాజలిజం డేగా ప్రకటించుకొని కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ కారణంగానే కాజల్ ఫ్యాన్స్ తమ అభిమాన నటి ఫొటోలను షేర్ చేస్తూ వరుస ట్వీట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. తన పేరు ఈ రేంజ్‌లో ట్రెండ్ అవ్వటంతో కాజల్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంత ప్రేమకు థ్యాంక్యూ అంటూ ట్వీట్ చేశారు.
Also Read :
కమ్మేసిన మంచు దుప్పటి.. తెలంగాణలోని ఆ రెండు జిల్లాలపై చలి పంజా…ఈ సీజన్‌లోనే అత్యల్పం
ఇంద్రపాలెం వద్ద విద్యుత్ తీగలు తగిలి కంటైనర్‌లో మంటలు.. 40 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతి