
ప్రతి మనిషికి సొంతిల్లు అనే ఓ ఎమోషన్‌తో ఉంటుంది. ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో పొదుపు చేసుకుని ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది అయితే ప్రస్తుతం ఉంటున్న ఇంటికి ఎలాగూ అద్దె కడుతున్నాం. కాబట్టి దాన్నే ఈఎంఐ కింద కట్టి సొంత ఇల్లు కొనుక్కుందామని హోం లోన్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం బ్యాంకులో హోం లోన్ తీసుకోవడం చాలా కష్టంతో కూడిన పనిగా మారింది. వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి వస్తుంది. అసలు హోం తీసుకోవడానికి చేయాల్సిన ప్రాసెస్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వెబ్‌సైట్‌లో పెట్టింది. చాలా సింపుల్‌గా ఎస్‌బీఐ హోంలోన్ పొందే విధానాన్ని అందుల్లో పేర్కొంది. ఆన్‌లైన్ ద్వారా కూడా ఎస్‌బీఐ హోం లోన్ పొందే అవకాశాన్ని కూడా కాబట్టి ఆ విధివిధానాలపై ఓ లుక్కేద్దాం.
వివిధ బ్యాంకులతో పోల్చుకుంటే ఎస్‌బీఐ హోం లోన్ తీసుకుంటే వినియోగదారులకు కొన్ని రకాల లాభాలున్నాయి. తక్కువ వడ్డీ రేట్లతో పాటు అతి తక్కువ ప్రాసెసింగ్ రుసుముతో వినియోగదారులకు చాలా ఈజీగా లోన్ పొందవచ్చు. అలాగే ముందస్తు చెల్లింపుపై కూడా ఎస్‌బీఐ పెనాల్టీ విధించడం లేదు. డైలీ రిడ్యూసింగ్ బ్యాలెన్స్‌పై వడ్డీ ఛార్జీలతో పాటు ఏకంగా 30 సంవత్సరాల వరకు తిరిగి చెల్లింపు చేసే ఆప్షన్‌ను ఎస్‌బీఐ ఖాతాదారులకు కల్పిస్తుంది. అలాగే హోమ్ లోన్ కూడా ఓవర్‌డ్రాఫ్ట్‌గా లభిస్తుంది. ముఖ్యంగా మహిళా రుణగ్రహీతలకు వడ్డీ రాయితీని బ్యాంకు కల్పిస్తుంది. అలాగే ఎస్‌బీఐ హోం లోన్ పొందడానికి 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్న వారు అర్హులు.
అయితే హోంలోన్ దరఖాస్తు ప్రక్రియలో అవసరమైతే బ్యాంక్ ఏదైనా ఇతర పత్రాన్ని అడగవచ్చని కస్టమర్‌లు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎస్‌బీఐ హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు ఏదైనా ఎస్‌బీఐ శాఖను సందర్శించాలి. లేదా బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు పత్రాలను అందించాలి. లోన్ మొత్తం, వడ్డీ రేటు, తిరిగి చెల్లించే వ్యవధి, క్రెడిట్ స్కోర్, ఆదాయం, ఆస్తి విలువ, లోన్ మొత్తం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం