Palnati Yuddham: పల్నాడులో యుద్ద వీరులు ఉపయోగించిన ఆయుధాలను కొలిచే సంస్కృతి.. వీరారాధనోత్సవాలు ప్రారంభం

Palnati Yuddham: ప్రపంచంలో యుద్ద వీరులు ఉపయోగించిన ఆయుధాలను కొలిచే సంస్కృతి రెండే రెండు చోట్ల ఉంది. ఒకటి రోమ్ అయితే మరొకటి పల్నాడు. ఇక్కడ ఐదు..

Palnati Yuddham: పల్నాడులో యుద్ద వీరులు ఉపయోగించిన ఆయుధాలను కొలిచే సంస్కృతి.. వీరారాధనోత్సవాలు ప్రారంభం
Follow us
Subhash Goud

|

Updated on: Dec 03, 2021 | 5:43 PM

Palnati Yuddham: ప్రపంచంలో యుద్ద వీరులు ఉపయోగించిన ఆయుధాలను కొలిచే సంస్కృతి రెండే రెండు చోట్ల ఉంది. ఒకటి రోమ్ అయితే మరొకటి పల్నాడు. ఇక్కడ ఐదు రోజుల పాటు ఈ వీరారాధనోత్సవాలను నిర్వహిస్తారు. చరిత్రలో మాచర్ల, గురజాల రాజ్యాల మధ్య జరిగిన యుద్దం మహాభారత కథను పోలి ఉంటుంది. బ్రహ్మానాయుడు, నాగమ్మ ఆయా రాజ్యాల మంత్రులుగా యుద్దం రంగంలో పాల్గొనటం తెలిసిందే. ఆ కథను తెలియజేస్తూ ప్రతిఏటా పల్నాటి యుద్దం జరిగిన కారంపూడి వీరుల గుడిలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మనాయుడు వినియోగించిన ఆయుధంతో పాటు ఇతరుల ఆయుధాలను ఈ ఉత్సవాల్లో భాగంగా పూజిస్తారు. మొదటి రోజు రాచగావు, రెండు రోజు రాయభారం, మూడు రోజు మందపోరు, నాలుగు రోజు కోడిపోరు, ఐదో రోజు కళ్ళిపాడు నిర్వహిస్తారు.

ఉత్సవాల్లో భాగంగా కోడి పోరు రోజున మాచర్ల, గురజాల నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు హాజరయి కోడి పందెం నిర్వహిస్తారు. బ్రహ్మనాయుడు ఆచరించిన సహపంక్తి భోజనాలు ఇప్పటికీ నిర్వహించడం విశేషం. ఈరోజు ఉత్సవాలను పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుండి ఆచారవంతులు తమ, తమ కొణతములు(ఆయుదాలు ఉంచే చిన్న పెట్టె)తో ఈ ఉత్సవాలకు హాజరు కావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఉత్సవాలకు జిల్లా పరిషత్ రెండు లక్షల రూపాయల నిధులను విడుదల చేసింది. కరోనా నేపధ్యంలో కట్టదిట్టమైన చర్యలు తీసుకొని ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

క్రీ.శ 1182లో పల్నాటి యుద్ధం:

ఏపీలోని పల్నాడు ప్రాంతంలో క్రీ.శ 1182లో పల్నాటి యుద్ధం జరిగినట్లు అప్పటి ఆధారాలను బట్టి తెలుస్తోంది. మహాభారతంకు, పల్నాటి వీరుల చరిత్రకు దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ యుద్ధం12వ శతాబ్దంలో ఏపీలో రాజకీయ, సాంఘిక, మతమార్పులకు ఉపయోగపడిన ఈ కీలక యుద్ధమనే చెప్పాలి. క్రీ.శ1176-1182 మధ్యకాలంలో కారంపూడి వద్ద పల్నాటి యుద్ధం శైవులు, వైష్ణవుల మధ్య చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి:

CM Jagan: ఉద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ గుడ్‌న్యూస్‌.. పీఆర్సీపై కీలక ప్రకటన

Omicron: ఒమిక్రాన్‌ కోసం ఔషధాన్ని తయారు చేసిన బ్రిటన్‌.. వివరాలు వెల్లడించిన పరిశోధకులు